Apple iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో పై భారీ తగ్గింపులు ప్రకటించారు. రిలయన్స్ డిజిటల్ రూ.10,000 ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించింది. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ఇప్పుడు రూ.1,09,900కే పొందవచ్చు. అలాగే, ఫ్లిప్‌కార్ట్ లో ఇంకా 5 వేల తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
రిలయన్స్ డిజిటల్ మళ్లీ ఆకర్షణీయమైన ఆఫర్‌తో వచ్చింది. ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro) పై రూ.10,000 ఫ్లాట్ తగ్గింపు ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎటువంటి షరతులు లేకుండా రూ.1,09,900కు విక్రయిస్తోంది. ప్రారంభ ధర రూ.1,19,900గా ఉన్న ఈ మోడల్‌కి ఇప్పుడే ఈ తగ్గింపు లభిస్తోంది.
ప్రస్తుతం ఎటువంటి బ్యాంక్ కార్డ్ ఆఫర్ అందుబాటులో లేదు. అయితే కస్టమర్లు తమ పాత మొబైల్ ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అదనపు తగ్గింపును పొందవచ్చు. క్యాషిఫై వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్స్ఛేంజ్ విలువను చెక్ చేయడం ద్వారా మంచి డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
26
ఫ్లిప్‌కార్ట్ లో ఐఫోన్ 16 ప్రో పై మరింత తగ్గింపు
రిలయన్స్ డిజిటల్ లో ఈ ఆఫర్ ఎంతకాలం అందుబాటులో ఉంటుందో వెల్లడించలేదు. కాబట్టి ఈ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారు త్వరగా డీల్స్ పూర్తి చేయడం మంచి ఆప్షన్ అవుతుంది. రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. పలు స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు ఉన్నాయి. ఐఫోన్ 16 ప్రో పై కూడా భారీ తగ్గింపులు ప్రకటించింది. 256 జీబీ వేరియంట్ ధర రూ.1,04,999 గా ఉంది. అలాగే, కార్డు ఆఫర్లు కూడా ఉన్నాయి. నో స్టాక్ బోర్డు పడకముందే తీసుకోండి మరి !
36
ఐఫోన్ 16 ప్రో డిస్‌ప్లే, డిజైన్
ఐఫోన్ 16 ప్రో లో 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్సడీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 2622x1206 పిక్సెల్స్ కాగా, పిక్సెల్ డెన్సిటీ 460ppi. ప్రో మోషన్ టెక్నాలజీ ద్వారా 120Hz వరకు రిఫ్రెష్ రేట్ కలిగిన స్మూత్ విజువల్స్ అందిస్తాయి. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, డైనమిక్ ఐస్లాండ్ ఫీచర్లు ఉన్నాయి.
ఫోన్ టైటానియం ఫ్రేమ్‌తో వస్తుంది. ముందు భాగంలో సిరామిక్ షీల్డ్ గ్లాస్, వెనుక భాగంలో టెక్స్చర్డ్ మ్యాట్ గ్లాస్ డిజైన్ తో ఉంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టంట్ కలిగి ఉంటుంది. బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, నాచురల్ టైటానియం, డెజర్ట్ టైటానియం రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ 16 ప్రో ఆపిల్ ఏ18 ప్రో చిప్ సెట్ ను కలిగి ఉంది. 3nm టెక్నాలజీతో తయారైన ఈ ప్రాసెసర్‌లో 6-core CPU, 6-core GPU, 16-core Neural Engine ఉన్నాయి. ఇది ఏఐ, మెషిన్ లెర్నింగ్ పనితీరును మెరుగుపరుస్తుంది.
ఫోన్ 8GB RAMతో వస్తుంది. స్టోరేజ్ ఆప్షన్లు 128GB, 256GB, 512GB, 1TB వరకు ఉన్నాయి. మెరుగైన థర్మల్ డిజైన్‌తో దీర్ఘకాలం హై పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ ఫోన్ iOS 18 సిస్టమ్‌పై నడుస్తుంది.
56
ఐఫోన్ 16 ప్రో కెమెరా, వీడియో ఫీచర్లు
ఐఫోన్ 16 ప్రో లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
• 48MP వైడ్ ప్రైమరీ కెమెరా (f/1.78 అపర్చర్)
• 12MP టెలిఫోటో కెమెరా (5x ఆప్టికల్ జూమ్)
• 48MP అల్ట్రా వైడ్ కెమెరా (ఆటోఫోకస్‌తో)
ఫ్రంట్ కెమెరా 12MP (f/1.9 అపర్చర్)తో వస్తుంది. ProRes వీడియో రికార్డింగ్, Apple Intelligence ఫీచర్ ద్వారా ఇమేజ్ ప్రాసెసింగ్ సూపర్ గా ఉంటుంది. A18 Pro చిప్ కారణంగా ఈ ఫోన్ 20% వేగవంతమైన పనితీరు, 15% వేగవంతమైన ప్రాసెసింగ్, మెరుగైన ఎనర్జీ ఎఫిషియెన్సీ అందిస్తుంది.
66
ఐఫోన్ 16 ప్రో బ్యాటరీ, కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు
ఐఫోన్ 16 ప్రో 3582 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. iPhone 15 Pro కంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. USB Type-C పోర్ట్‌తో వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్ సపోర్ట్ చేస్తుంది. వైఫై 7, బ్లూటూత్ 5.3, ఎన్ఫీసీ, 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ సిమ్ (నానో +ఈ సిమ్) సపోర్టు ఉంటుంది. Qi 2, MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
బరువు 199 గ్రాములు. పరిమాణాలు 149.6 x 71.5 x 8.25 mm. రిటైల్ బాక్స్‌లో ఛార్జర్ ఉండదు. అయితే ఆండ్రాయిడ్ ఛార్జర్‌తో కూడా ఛార్జ్ చేయవచ్చు.