
దీపావళి పండుగకు ముందు ఫ్లిప్‌కార్ట్ భారీ ఫెస్టివ్ సేల్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్లలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, వివో X200 FE వంటి ఫ్లాగ్‌షిప్ మోడళ్ల ధరలు తగ్గించారు. అలాగే, కొనుగోలుదారులు యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో అదనపు తగ్గింపులు పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 (iPhone 16 128GB) ఇప్పుడు ₹57,999కి లభిస్తోంది. అసలు ధర ₹69,900గా ఉంది. అలాగే, ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా అదనంగా ₹3,000 తగ్గింపు, అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్‌గా ₹48,990 వరకు లభిస్తుంది.
ఐఫోన్ 16లో 6.1 అంగుళాల డిస్‌ప్లే, 128GB ఇంటర్నల్ స్టోరేజ్, iOS ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతుంది. 48MP ఫ్యూజన్ మెయిన్ కెమెరా, ఆటోఫోకస్ ఉన్న అల్ట్రా వైడ్ లెన్స్, 2x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. A18 చిప్‌తో వచ్చే ఈ ఫోన్ ఫోటో, వీడియో, గేమింగ్‌లో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.
ప్రీమియం కేటగిరీలో అత్యధిక డిమాండ్ ఉన్న ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (iPhone 16 Pro Max 256GB) ఇప్పుడు ₹1,14,999కి లభిస్తోంది. దీని అసలు ధర ₹1,34,900. ఈ తగ్గింపుతో పాటు యాక్సిస్ బ్యాంకు కార్డ్ వినియోగదారులకు అదనంగా ₹4,000 తగ్గింపును అందిస్తోంది. అలాగే, ఎక్స్చేంజ్ ఆఫర్ ₹61,900 వరకు అందుబాటులో ఉంది.
టైటానియం ఫ్రేమ్, సెరామిక్ షీల్డ్ ఫ్రంట్, మ్యాట్ గ్లాస్ బ్యాక్‌తో ఇది నాలుగు రంగుల్లో లభిస్తుంది. వాటిలో బ్లాక్, వైట్, నేచురల్, డెజర్ట్ కలర్స్ ఉన్నాయి.
6.9 అంగుళాల సూపర్ రెటినా (Super Retina XDR OLED) డిస్‌ప్లే 120Hz ప్రో మోషన్, HDR, Always-On ఫీచర్‌లతో వస్తుంది. A18 Pro చిప్ సెట్ ను కలిగి ఉంది. ఈ మోడల్‌లో 48MP ఫ్యూజన్, 48MP అల్ట్రా వైడ్, 5x టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. 4కే డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్, వైఫై 7, స్పేషియల్ ఆడియో, ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
శాంసంగ్ గెలక్సీ ఎస్ 25 ఎడ్జ్ (Samsung Galaxy S25 Edge 5G) ప్రస్తుతం ₹89,999కి లభిస్తోంది. దీని అసలు ధర ₹1,09,999. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు తో కోనుగోలు చేస్తే ₹4,000 అదనపు తగ్గింపును అందిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌గా ₹83,780 వరకు ఉంది. ఈ ఫోన్‌లో 6.65 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 12GB RAM, 256GB స్టోరేజ్ ఉన్నాయి.
కెమెరా విభాగంలో 200MP మెయిన్, 12MP సెకండరీ, 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 3900mAh బ్యాటరీ, గెలాక్సీ ఏఐ, నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ, ఐపీ68 రేటింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలుగా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా (alaxy S25 Ultra 5G) ఇప్పుడు ₹1,04,727కి లభిస్తోంది. దీని అసలు ధర ₹1,29,999. యాక్సిస్ బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ₹4,000 అదనపు తగ్గింపు కూడా లభిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌గా ₹61,900 వరకు ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.85 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 పై నడుస్తుంది. 200MP, 50MP, 50MP, 10MP కెమెరా సెన్సర్లు, 5000mAh బ్యాటరీ, ఎస్ పెన్ సపోర్ట్, గెలాక్సీ ఏఐ, ఐపీ 68 సర్టిఫికేషన్, ఆడియో ఇరేసర్ టూల్ ఈ మోడల్ ప్రత్యేకతలుగా ఉన్నాయి.
వివో ఎక్స్ 200 ఎఫ్ఈ (Vivo X200 FE 5G) ఇప్పుడు ₹59,999కి లభిస్తోంది. దీని అసలు ధర ₹64,999. ఫ్లిప్ కార్ట్ లో యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ₹4,000 తగ్గింపును కూడా అందిస్తోంది. అలాగే, ఎక్స్చేంజ్ ఆఫర్‌గా ₹50,490 వరకు ఉంది.
ఈ ఫోన్ 6.31 అంగుళాల AMOLED 120Hz డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 పై నడుస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్‌తో 16జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. కెమెరా విభాగంలో 50MP + 50MP + 8MP ట్రిపుల్ కెమెరా సెట్‌ప్, 6500mAh బ్యాటరీ, 90W ఫ్లాష్‌చార్జ్, జైసిస్ ఇమేజింగ్, ఐపీ 68/69 రేటింగ్, ఐఏ ఇమేజ్ స్టూడియో వంటి ఫీచర్లు ఉన్నాయి.
దీపావళి సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ ఆఫర్లు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు మంచి డీల్స్ గా ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్‌తో పాటు తగ్గింపులు అందుబాటులో ఉండటం కొనుగోలును మరింత లాభదాయకం అని చెప్పవచ్చు.