Big Discounts on ACs : దీపావళి సందర్భంగా భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. చలికాలం ప్రారంభం కానుండటంతో 1.5 టన్ స్ప్లిట్ ఏసీలపై ఆన్‌లైన్‌లో భారీ తగ్గింపులు ప్రకటించారు. వోల్టాస్, ఎల్‌జీ, బ్లూ స్టార్ వంటి టాప్ బ్రాండ్లు ఆఫర్లు అందిస్తున్నాయి.
దీపావళి తో పాటు చలికాలం ప్రారంభం కానున్న క్రమంలో ఎయిర్ కండీషనర్ల (AC) ధరలు భారీగా తగ్గాయి. ఆన్‌లైన్ సేల్స్‌లో అనేక బ్రాండ్లు తమ 1.5 టన్ స్ప్లిట్ ఏసీలపై భారీ ఆఫర్లను ప్రకటించాయి. వేసవిలో ధరలు పెరగకముందే ఇప్పుడు కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులు భారీ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. ఈ తగ్గింపులు వోల్టాస్, బ్లూ స్టార్, ఎల్‌జీ, డైకిన్, క్యారియర్ వంటి టాప్ బ్రాండ్లపై అమల్లో ఉన్నాయి.
26
వోల్టాస్ (Voltas) 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ
వోల్టాస్ కంపెనీ 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అసలు ధర ₹64,990. అయితే, ప్రస్తుతం ఆన్‌లైన్ సేల్‌లో కేవలం ₹29,250కి లభిస్తోంది.
ఈ ఏసీ 5 స్పీడ్ ఫ్యాన్ ఫంక్షన్ తో 4 విభిన్న మోడ్ ఫీచర్లను కలిగి ఉంది. గదిలో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఇది 52 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా గదిని చల్లగా ఉంచుతుంది. ఒక సంవత్సరం వారంటీతో పాటు, 10 రోజుల బ్రాండ్ రీప్లేస్‌మెంట్ వారంటీ కూడా అందిస్తున్నారు. ఇది 3 స్టార్ రేటింగ్ కలిగిన మోడల్.
ఎల్‌జీ కంపెనీ నుండి వచ్చిన ఈ 1.5 టన్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలో కాపర్ కాయిల్ ఉంటుంది. అలాగే, 6 కన్వర్టబుల్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. వేగంగా కూలింగ్ చేయడమే కాకుండా విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
హెచ్‌డీ ఫిల్టర్ల సాయంతో గాలి ద్వారా వచ్చే వైరస్‌లను కూడా అడ్డుకుంటుంది. ఈ ఏసీ 55 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా గదిని చల్లగా ఉంచుతుందని కంపెనీ చెబుతోంది. దీని అసలు ధర ₹78,990 కాగా, ప్రస్తుతం ₹32,450కు పండగ సేల్ లో లభిస్తోంది.
బ్లూ స్టార్ బ్రాండ్‌కు చెందిన ఈ 1.5 టన్ వైఫై ఇన్వర్టర్ ఏసీ అసలు ధర ₹75,000 కాగా, ఇప్పుడు ఇది ₹39,970లకు సేల్ లో అందుబాటులో ఉంది. ఇది 5 స్టార్ రేటింగ్ కలిగిన ఈ ఏసీ పై 5 సంవత్సరాల వారంటీని అందిస్తున్నారు. వైఫై సపోర్ట్ కూడా ఉంది. దీంతో ఈ ఏసీని స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా నియంత్రించవచ్చు. అలాగే, వాయిస్ కమాండ్ టెక్నాలజీతో వాయిస్ అసిస్టెంట్ ద్వారా ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. గదిలో నాలుగు దిశలకూ గాలి సరఫరా చేసే ఫీచర్ ఇందులో ఉంది.
56
డైకిన్ (Daikin) 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ
డైకిన్ బ్రాండ్ 1.5 టన్ ఇన్వర్టర్ ఏసీ అసలు ధర ₹67,200 కాగా, ప్రస్తుతం ఇది ₹40,490కి లభిస్తోంది. 5 స్టార్ రేటింగ్ కలిగిన ఈ ఏసీ.. మొత్తం గదికి సమానమైన కూలింగ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది పీఎం 2.5 పార్టికల్స్‌ను అడ్డుకునే ఫిల్టరింగ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. దీంతో గాలి నాణ్యత మెరుగ్గా ఉంటుంది. డైకిన్ ఏసీ 54 డిగ్రీల వేడిలో కూడా వేగంగా కూలింగ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
66
క్యారియర్ (Carrier) 1.5 టన్ వైఫై ఇన్వర్టర్ ఏసీ
క్యారియర్ 1.5 టన్ వైఫై ఇన్వర్టర్ కూడా సగం ధరకే పండగ సేల్ లో అందుబాటులో ఉంది. ఇది 52 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. స్టెబిలైజర్ అవసరం లేకుండా ఇది నడుస్తుంది. ఈ ఏసీని మొబైల్ యాప్ ద్వారా లేదా వాయిస్ అసిస్టెంట్ సహాయంతో నియంత్రించవచ్చు. దీని అసలు ధర ₹62,000 కాగా, ప్రస్తుతం ఆన్‌లైన్ లో ₹31,490కు అందుబాటులో ఉంది.