Top 5 Smartphones Under 10K : రూ. 10 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. కెమెరా, బ్యాటరీ సూపర్ !

Published : Jan 27, 2026, 03:29 PM IST

Top 5 Smartphones Under 10K : రూ. 10 వేల బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్, రెడ్‌మి, పోకో, ఐటెల్ బ్రాండ్ల నుండి అద్భుతమైన ఫీచర్లతో లభించే బెస్ట్ ఫోన్ల పూర్తి వివరాలు, ధరలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
కేవలం రూ. 8 వేల నుంచే.. ఈ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాక్!

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లకు డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రూ. 10,000 లోపు ధరలో అనేక మంచి స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. పనితీరు, ఫీచర్ల పరంగా ఇవి అద్భుతంగా ఉన్నాయి. కాలింగ్, బ్రౌజింగ్, బ్యాటరీ బ్యాకప్ వంటి విషయాలలో ఇవి ఖరీదైన ఫోన్లకు ఏమాత్రం తీసిపోవు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఇవి మంచి ఎంపిక. 

కేవలం మాట్లాడటానికే కాకుండా షాపింగ్, ఆన్‌లైన్ చదువులు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, బ్యాంకింగ్, ఆన్‌లైన్ పేమెంట్స్ వంటి ఎన్నో పనులు మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే, ప్రతి ఒక్కరికీ ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొనడం సాధ్యం కాదు. అందుకే, మీరు చాలా తక్కువ ధరలో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే, మార్కెట్లో ఉన్న బెస్ట్ ఆప్షన్ల వివరాలు గమనిస్తే..

26
1. శాంసంగ్ గెలాక్సీ F06

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ నుంచి వచ్చిన ఈ మోడల్ 10 వేల రేంజ్‌లో అత్యుత్తమమైన ఫోన్‌గా నిలుస్తోంది. బ్రాండ్ వాల్యూతో పాటు మంచి స్పెక్స్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.

• ప్రాసెసర్: ఈ స్మార్ట్‌ఫోన్ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, ఇది రోజువారీ పనులకు చక్కగా సరిపోతుంది.

• కెమెరా: ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు 50MP డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అందించారు.

• బ్యాటరీ: ఇందులో 5000mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉంది, రోజంతా ఫోన్ కు ఛార్జింగ్ పెట్టాల్సిన పనివుండదు.

• స్టోరేజ్, ధర: ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 8,999 గా ఉండగా, అమెజాన్‌లో రూ. 9,999 కి కొనుగోలు చేయవచ్చు.

36
2. రెడ్‌మి 14C 5G

తక్కువ ధరలో 5G అనుభవాన్ని పొందాలనుకునే వారికి రెడ్‌మి 14C ఒక మంచి ఆప్షన్. ఇది లేటెస్ట్ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

• ప్రాసెసర్: ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 5G ప్రాసెసర్‌తో వస్తుంది, ఇది వేగవంతమైన పనితీరును అందిస్తుంది.

• కెమెరా: ఇందులో 50 MP రియర్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి, ఇవి స్పష్టమైన ఫోటోలను తీయగలవు.

• బ్యాటరీ: దీని బ్యాటరీ కెపాసిటీ 5160mAh, ఇది సాధారణ బ్యాటరీల కంటే కాస్త ఎక్కువ బ్యాకప్ ఇస్తుంది.

• స్టోరేజ్, ధర: ఈ ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. అమెజాన్ సైట్‌లో ఈ మొబైల్ ధర రూ. 9,499 గా ఉంది.

46
3. పోకో C75

పెద్ద డిస్‌ప్లే, స్టైలిష్ లుక్ కోరుకునే వారికి పోకో C75 ఒక అద్భుతమైన ఎంపిక. ముఖ్యంగా వీడియోలు చూసే వారికి ఇది బాగా నచ్చుతుంది.

• డిస్‌ప్లే: ఇందులో భారీ 6.88 అంగుళాల డిస్‌ప్లేను అందించారు.

• కెమెరా: వెనుక వైపు 50MP డ్యుయల్ రియర్ కెమెరా సెటప్, ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

• బ్యాటరీ, ఛార్జింగ్: 5160mAh బ్యాటరీతో పాటు బాక్సులో 10 వాట్ల ఛార్జర్ లభిస్తుంది.

• ధర: అమెజాన్‌లో ఈ మొబైల్‌ను రూ. 8,149 కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఇది ఇంకాస్త తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.

56
4. ఐటెల్ A95

బడ్జెట్ సెగ్మెంట్లో ఐటెల్ కంపెనీ కూడా పోటీపడుతూ A95 అనే 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉండటం విశేషం.

• డిస్‌ప్లే: ఇందులో 6.6 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే ఉంది. ఇది మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

• AI ఫీచర్లు: ఈ ఫోన్‌లో AI అసిస్టెన్స్ Aivana పనిచేస్తుంది, ఇది యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుస్తుంది.

• ధర: 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ. 9,599 గా ఉండగా, 6GB ర్యామ్ వేరియంట్ రూ. 9,999 గా ఉంది.

66
5. మోటో G35 5G

రూ. 10 వేల బడ్జెట్‌లో మోటరోలా నుంచి వచ్చిన మరొక అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ మోటో G35 5G. ఇందులో 5000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించారు. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం వెనుక వైపు 50MP మెయిన్ కెమెరాతో పాటు 8MP సెకండరీ కెమెరా ఉంది. ఇక సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఇవ్వడం విశేషం. ఈ ఫోన్ 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ సైట్లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కేవలం రూ. 9,999 ధరకే లభిస్తోంది. తక్కువ ధరలో మంచి 5G ఫోన్ కావాలనుకునే వారికి ఇది చక్కటి ఎంపిక.

బడ్జెట్ ఫోన్ల కొనుగోలులో గమనించాల్సిన అంశాలు ఇవే

పైన పేర్కొన్న స్మార్ట్‌ఫోన్లు అన్నీ రూ. 10,000 లోపు ధరలోనే లభిస్తాయి. మీరు ఆన్‌లైన్ క్లాసులు వినాలన్నా, సోషల్ మీడియా వాడాలన్నా లేదా సాధారణ గేమింగ్ ఆడాలన్నా ఈ ఫోన్లు సరిపోతాయి. ముఖ్యంగా శాంసంగ్, రెడ్‌మి, పోకో వంటి బ్రాండెడ్ కంపెనీల నుండి ఈ ధరలో 50MP కెమెరా, 5000mAh పైగా బ్యాటరీ లభించడం వినియోగదారులకు కలిసొచ్చే అంశం. మీ అవసరాలకు అనుగుణంగా, మీకు నచ్చిన బ్రాండ్, స్పెసిఫికేషన్లను బట్టి వీటిలో ఒకదానిని ఎంచుకోవచ్చు.

గమనిక: ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ఆఫర్లను బట్టి ధరలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కొనుగోలు చేసే ముందు ప్రస్తుత ధరను సరిచూసుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories