ఫోన్‌ను తాకకుండానే ఫొటోలు, వీడియోలు, స్క్రోలింగ్.. రూ. 400కే సూప‌ర్ గ్యాడ్జెట్

Published : Sep 02, 2026, 06:19 PM IST

Bluetooth Selfie Remote: స్మార్ట్‌ఫోన్‌ను తాక‌కుండా ఫొటోలు, వీడియోలు తీసుకునే అవ‌కాశం ఉంటే భ‌లే ఉంటుంది క‌దూ! ఇలాంటి వారికోస‌మే అమెజాన్‌లో బ్లూటూత్ సెల్ఫీ రిమోట్ పేరుతో ఒక మంచి గ్యాడ్జెట్ అందుబాటులో ఉంది. ఈ గ్యాడ్జెట్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు.

PREV
15
ఫోన్‌ను తాకకుండానే స్క్రోలింగ్

ఈ బ్లూటూత్‌ రిమోట్‌తో స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్‌ను చేతితో స్క్రీన్ తాకకుండా స్క్రోల్ చేయవచ్చు. పైకి, కిందికి స్క్రోల్ చేయడం, వీడియోలను ప్లే లేదా పాజ్ చేయడం, కొన్ని యాప్స్‌లో లైక్ చేయడం, వాల్యూమ్‌ను పెంచడం లేదా తగ్గించడం వంటి పనులు చేయొచ్చు. ముఖ్యంగా రీల్స్‌, షార్ట్స్ వంటి వీడియో కంటెంట్ చూసే సమయంలో ఇది ఉపయోగపడుతుంది. ధ‌ర విష‌యానికొస్తే ఈ ప్రొడ‌క్ట్ అస‌లు ధ‌ర అమెజాన్‌లో రూ. 1199 ఉండ‌గా ఏకంగా 67 శాతం డిస్కౌంట్‌తో రూ. 399కి ల‌భిస్తోంది.

25
ఫొటోలు, వీడియోలు తీయడానికి ఉపయోగకరం

మొబైల్ కెమెరాను రిమోట్‌గా కంట్రోల్ చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఫోన్‌ను ట్రైపాడ్‌పై పెట్టి కొంత దూరం నుంచి ఫొటో క్లిక్ చేయొచ్చు. సెల్ఫీలు, గ్రూప్ ఫొటోలు, వ్లాగింగ్, డ్యాన్స్ వీడియోలు, వర్కౌట్ వీడియోలు తీసేటప్పుడు ఫోన్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కొన్ని కెమెరా ఫంక్షన్లలో వీడియో రికార్డింగ్‌ను ప్రారంభించడం లేదా ఆపడం, జూమ్ వంటి ఆప్షన్లను కూడా ఉపయోగించవచ్చు.

35
10 మీటర్ల వరకు బ్లూటూత్‌ కనెక్షన్

ఈ రిమోట్ బ్లూటూత్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్‌తో కనెక్ట్ అవుతుంది. సుమారు 10 మీటర్ల దూరం వరకు పనిచేసేలా దీనిని రూపొందించారు. అందువల్ల ట్రైపాడ్‌తో ఫొటోలు తీసేటప్పుడు లేదా బయట వీడియోలు రికార్డ్ చేసేటప్పుడు కొంత దూరం నుంచి ఫోన్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఒకేసారి ఒక డివైజ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది.

45
Type-Cతో రీచార్జ్ చేసుకునే బ్యాటరీ

ఈ రిమోట్‌లో ప్రత్యేకంగా బ్యాటరీలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులోనే రీచార్జ్ చేసుకునే బ్యాటరీ ఉంటుంది. Type-C ఛార్జింగ్ పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. దీంతో డిస్పోజబుల్ బ్యాటరీలు కొనాల్సిన అవసరం ఉండదు. చిన్న సైజులో ఉండటం వల్ల జేబులో లేదా బ్యాగ్‌లో సులభంగా పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.

55
వాడటం సులభం.. ఎవరు ఉపయోగించవచ్చంటే?

బ్లూటూత్ సెల్ఫీ రిమోట్‌ను ఫోన్‌తో సులభంగా పెయిర్ చేసుకోవచ్చు. బటన్లు కూడా సాధారణంగా ఉపయోగించుకునే విధంగా ఉంటాయి. ఫొటోలు, వీడియోలు తీసుకునే సాధారణ వినియోగదారులతో పాటు కంటెంట్ క్రియేటర్లు, వ్లాగర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించే వారు, లైవ్ స్ట్రీమింగ్ చేసేవారికి ఇది ఉపయోగపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories