రూ.30 వేల లోపు 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే

Published : Oct 26, 2025, 08:58 PM IST

Best Camera Phones Under Rs 30000: ప్రస్తుతం మార్కెట్ లో సూపర్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. రూ.30 వేల లోపు వివో, మోటరోలా, నథింగ్, రియల్ మీ బ్రాండ్స్ లో బెస్ట్ కెమెరా ఫోన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
కెమెరా ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కెమెరా ఫోన్లకు ఎప్పటికప్పుడూ డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఆపిల్, శాంసంగ్, షావోమీ వంటి టాప్ బ్రాండ్లు తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కెమెరాపై ఎక్కువ దృష్టి పెట్టాయి. అద్భుతమైన క్వాలిటీలో ఫోటోలు, వీడియోలు కావాలనుకునే వారికి తక్కువ ధరలో కూడా స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో ఉన్నాయి.

రూ.30 వేల లోపు కూడా అనేక ఫోన్లు అత్యుత్తమ కెమెరా ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ఆప్టికల్ జూమ్, స్టెబిలైజేషన్, టెలిఫోటో జూమ్, హై రిజల్యూషన్ వంటి ఫీచర్లు ఇప్పుడు మిడ్‌రేంజ్ ఫోన్లలోనే లభిస్తున్నాయి. ఏఐ కెమెరా సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటి బెస్ట్ ఫోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

26
వివో వీ60ఈ : 200MP కెమెరా హైలైట్

వివో వీ60ఈ (Vivo V60e) లో 200 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. HP9 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. రియర్‌లో 8 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్‌లో 50 మెగాపిక్సల్ ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా ఉంది. ఆరా లైట్ సపోర్ట్‌తో పాటు భారత్‌లో తొలి ఏఐ ఫెస్టివల్ పోర్ట్రెయిట్ మోడ్ అందించారు. తక్కువ వెలుతురులో మంచి పోర్ట్రెయిట్లు క్యాప్చర్ చేయడం దీని ప్రత్యేకత.

ఫోన్‌లో 6.77 అంగుళాల FHD+ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్టు ఉంది. MediaTek Dimensity 7360 Turbo చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్ టచ్ ఓఎస్ (Funtouch OS) 15 తో వస్తుంది. 8GB + 128GB మోడల్‌ ధర రూ.29,999గా ఉంది.

36
Motorola Edge 60 Pro: ట్రిపుల్ కెమెరా సెటప్

మోటరోలా ఎడ్జ్ 60 ప్రో (Edge 60 Pro) లో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్ (మ్యాక్రో సపోర్ట్‌తో), 10MP 3X టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 50MP.

6.7 అంగుళాల 1.5K pOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. అండ్రాయిడ్ 15 తో వస్తుంది. Dimensity 8350 Extreme చిప్‌సెట్, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 8GB + 256GB ధర రూ.29,999గా ఉంది.

46
Nothing Phone (3a): అఫోర్డబుల్ టెలిఫోటో ఆప్షన్

3X పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్న అతి తక్కువ ధరలో లభించే ఫోన్లలో నథింగ్ ఫోన్ 3ఏ ఒకటి. రియర్‌లో 50MP మెయిన్, 8MP అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. 6X ఇన్-సెన్సర్ జూమ్ అందించారు. ఫ్రంట్ కెమెరా 50MPగా ఉంది.

6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా నథింగ్ ఓఎస్ 3.1 పై రన్ అవుతుంది. 8GB + 128GB ధర రూ.29,999గా ఉంది.

56
Vivo T4 Pro: కర్వ్డ్ డిస్ప్లేతో సూపర్ కెమెరా సెటప్

వివో టీ4 ప్రో లో రియర్‌లో 50MP డ్యూయల్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ అందించారు. ఫ్రంట్‌లో 32MP కెమెరా ఉంది. స్నాప్ డ్రాగన్ 7 Gen 4 SoC తో పనిచేస్తుంది. 6.77 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 5000 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్టు చేస్తుంది. 8GB + 128GB వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది.

66
Realme 15 Pro 5G: సోనీ సెన్సార్ ప్రత్యేకత

రియల్ మీ 15 ప్రో 5జీలో 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సోనీ IMX896 సెన్సార్ మెయిన్ కెమెరాలో ఉంది. 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి.

6.8 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్టు ఉంది. 7000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి. 8GB + 128GB వేరియంట్ ధర రూ.28,999 గా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories