Apple iPhone 18 Pro: ఆపిల్ హిస్టరీలోనే బిగ్ ఛేంజ్.. ఐఫోన్ 18 ప్రోతో పాటు తొలి ఐఫోన్ ఆల్ట్రా.. కెమెరా చూస్తే మైండ్ బ్లాకే

Published : Sep 07, 2026, 07:09 AM IST

Apple iPhone 18 Pro: ఆపిల్ 'సర్‌ప్రైజ్ అండ్ షైన్' ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్, తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ఆల్ట్రాను లాంచ్ చేయనుంది. గూగుల్ జెమిని ఏఐ ఇంటిగ్రేషన్ ప్రధాన ఆకర్షణ నిలవనుంది. ఆ వివరాలు మీకోసం.

PREV
15
ఐఫోన్ 18 ప్రో.. ఆపిల్ చరిత్రలోనే అతిపెద్ద మార్పు

స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసించే ఆపిల్ సంస్థ ఈసారి మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్‌తో ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 9న జరగనున్న 'సర్‌ప్రైజ్ అండ్ షైన్' గ్రాండ్ ఈవెంట్‌లో ఆపిల్ కొత్త ఐఫోన్ 18 సిరీస్‌ను ఆవిష్కరించబోతోంది. పసిఫిక్ సమయం ప్రకారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతిసారీ ఐఫోన్ లాంచ్ అయితే టెక్ మార్కెట్ ఊగిపోతుంది. కానీ ఈసారి సీన్ వేరేలా ఉంది.. ఆపిల్ సీఈఓ జాన్ టెర్నస్ నాయకత్వంలో జరుగుతున్న ఈ తొలి ఈవెంట్‌లో గూగుల్ జెమిని ఏఐ ని పరిచయం చేయడం, యాపిల్ చరిత్రలోనే మొదటిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకరావడం, అలాగే ఫోన్ల విడుదల వ్యూహాన్ని రెండుగా విభజించడం వంటి కీలక నిర్ణయాలు స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని మార్చబోతున్నాయి.

25
గూగుల్ జెమిని ఏఐ.. ఐఓఎస్ 26లో సంచలనం

2011లో ఐఫోన్ 4ఎస్‌తో సిరిని పరిచయం చేసిన ఆపిల్, ఆ తర్వాత మొబైల్ ఏఐ రేసులో వెనుకబడిపోయింది. WWDC 2024లో 'ఆపిల్ ఇంటెలిజెన్స్' పేరుతో భారీ ప్రకటన చేసినప్పటికీ, ఆండ్రాయిడ్ పోటీదారుల స్థాయికి సరిపడా ఏఐ ఫీచర్లను అందించడంలో విఫలమైంది. దీన్ని అధిగమించడానికి ఆపిల్ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. కొత్త ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తో పాటు వస్తున్న ఐఓఎస్ 26 లో గూగుల్ జెమిని టెక్నాలజీని వాడుతోంది. ప్రైవసీకి పెద్దపీట వేస్తూనే గూగుల్ ఏఐ పవర్ ద్వారా ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను అందించనుంది. గతంలో సెర్చ్ ఇంజిన్ కోసం గూగుల్‌పై ఆధారపడినట్లే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం కూడా గూగుల్ వైపే మొగ్గు చూపడం విశేషం.

35
బుక్ స్టైల్‌లో ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ ఆల్ట్రా'

2019లో శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్‌తో ప్రారంభమైన ఫోల్డబుల్ ట్రెండ్‌లోకి ఆపిల్ ఎట్టకేలకు అడుగుపెడుతోంది. 'ఐఫోన్ ఆల్ట్రా' (iPhone Ultra) పేరుతో రానున్న ఈ ప్రైమ్ మోడల్ బుక్-స్టైల్ డిజైన్‌తో ఉండనుంది. బయట 5.5 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, ఓపెన్ చేస్తే 7.8 అంగుళాల పెద్ద ట్యాబ్ లాంటి స్క్రీన్ కనిపిస్తాయి. ఓపెన్ చేసినప్పుడు కేవలం 4.5 మిమీ, మడిచినప్పుడు 9 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. ఫేస్ ఐడీ స్థానంలో సైడ్ బటన్‌లో టచ్ ఐడీ ఇవ్వనున్నారు. A20 ప్రో 2nm చిప్‌సెట్, 12GB రామ్, డ్యూయల్ రియర్ కెమెరాలు (వైడ్, అల్ట్రా వైడ్), 5,400mAh నుండి 5,800mAh వరకు భారీ బ్యాటరీ కెపాసిటీతో ఈ ఫోన్ రానుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 1.75 లక్షలకు పైగా ఉండవచ్చని సమాచారం.

45
ఐఫోన్ 18 ప్రో కెమెరా, బ్యాటరీలలో బిగ్ అప్‌గ్రేడ్స్

మిగతా ఫ్లాగ్‌షిప్ మోడల్స్ అయిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఫీచర్లతో వస్తున్నాయి. ఇందులో మొదటిసారిగా వేరియబుల్ ఎపర్చర్ కలిగిన మెయిన్ కెమెరాను అందిస్తున్నారు. దీనివల్ల వెలుతురు తక్కువగా ఉన్న సమయంలోనూ, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ షాట్స్ తీసేటప్పుడు ఫోటోలు క్రేజీగా వస్తాయి. డైనమిక్ ఐలాండ్ సైజును మరింత చిన్నదిగా చేస్తున్నారు. ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో ఏకంగా 5,567mAh బ్యాటరీతో పాటు ఎల్టీపీఓ+ డిస్ప్లే టెక్నాలజీని వాడుతున్నారు. దీనివల్ల బ్యాటరీ లైఫ్ చాలా సమయం వస్తుంది. కొత్త కలర్ ఆప్షన్లలో డార్క్ చెర్రీ, లైట్ బ్లూ, సిల్వర్ వేరియంట్లు వుండనున్నాయి.

55
మార్చి 2027కి బేసిక్ మోడల్స్.. యాపిల్ మైండ్ గేమ్ లాంచ్ స్ట్రాటజీ

ఈసారి సెప్టెంబర్ ఈవెంట్‌లో కేవలం ప్రో మోడల్స్ (18 Pro, 18 Pro Max, Ultra) మాత్రమే లాంచ్ కానున్నాయి. బేసిక్ మోడల్స్ అయిన ఐఫోన్ 18, ఐఫోన్ 18 ఎయిర్, ఐఫోన్ 18e ఫోన్లను 2027 మార్చి లేదా ఏప్రిల్ నాటికి వాయిదా వేశారు. సాధారణంగా సెప్టెంబర్‌లో ఫోన్ కొనాలనుకునే యూజర్లను ప్రో మోడల్స్ వైపు పుష్ చేసేలా యాపిల్ ప్లాన్ చేసింది. అంతేకాకుండా, ఏడాదికి రెండుసార్లు లాంచ్ ఈవెంట్లు పెట్టడం ద్వారా ఆండ్రాయిడ్ మిడ్-రేంజ్ ఫోన్లకు మీడియా కవరేజ్ తగ్గించి, మార్కెట్‌లో నిరంతరం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడమే ఆపిల్ ప్రధాన వ్యూహం. ఇదే ఈవెంట్‌లో ఆపిల్ వాచ్ సిరీస్ 12, అల్ట్రా 4, ఎయిర్‌పాడ్స్ 5, కొత్త హోమ్ హబ్, అలాగే ఐఓఎస్ 27 (iOS 27) రిలీజ్ డేట్లను వెల్లడించనున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories