FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026లో జర్మనీ ఘోర పరాజయం పాలైంది. పరాగ్వేపై పెనాల్టీ షూటౌట్‌లో కిక్ కొట్టేందుకు భయపడి వెనకడుగు వేసిన నలుగురు సీనియర్ ప్లేయర్స్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అరాచకం సామీ.. మ్యాచ్ గెలవాల్సిన టైంలో వణికిపోయిన జర్మనీ ప్లేయర్స్.. అభిమానులు ఫైర్
నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన జర్మనీ ఫుట్‌బాల్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 32 పోరాటంలో పరాగ్వే చేతిలో 3-2 (పెనాల్టీ షూటౌట్) తేడాతో ఓడిపోయి జర్మనీ టోర్నమెంట్ నుండి అర్ధాంతరంగా తట్టాబుట్టా సర్దేసింది. అయితే ఈ ఓటమి కంటే కూడా, మ్యాచ్ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన ఒక షాకింగ్ నిజం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ లవర్స్ ను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. సడన్ డెత్ లాంటి అత్యంత కీలకమైన టైంలో పెనాల్టీ కిక్ కొట్టడానికి జర్మనీకి చెందిన నలుగురు స్టార్ ప్లేయర్స్ ఏకంగా భయపడి వెనక్కి తగ్గారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
26
సడన్ డెత్ టైంలో వణికిపోయిన స్టార్స్
నిర్ణీత సమయంలో, అలాగే ఎక్స్‌ట్రా టైంలోనూ రెండు జట్లు 1-1 తో సమంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. మొదటి ఐదు పెనాల్టీల తర్వాత ఇరు జట్లు 3-3 తో ఈక్వల్‌గా ఉన్నాయి. ఇక్కడే అసలు డ్రామా మొదలైంది. మ్యాచ్ ఫలితాన్ని తేల్చే ఆరో పెనాల్టీ వేయడానికి జర్మనీ జట్టులోని నలుగురు సీనియర్ ప్లేయర్స్ ఒప్పుకోలేదు. తమకు అంత కాన్ఫిడెన్స్ లేదంటూ వారు చేతులెత్తేశారు. ప్రముఖ జర్మన్ మీడియా సంస్థ బిల్డ్ (Bild) రిపోర్ట్ ప్రకారం.. లియాన్ గోరెట్‌స్కా, వాల్డెమర్ ఆంటన్, నథానీల్ బ్రౌన్, మాలిక్ తిషావ్ అనే నలుగురు ప్లేయర్స్ కిక్ తీసుకోకుండా తప్పుకున్నారు.
36
కెప్టెన్ రెండు సార్లు అడిగినా నో చెప్పిన గోరెట్‌స్కా
జర్మనీ జట్టులో అందరికంటే షాకింగ్ నిర్ణయం లియాన్ గోరెట్‌స్కాదే. జర్మనీ తరఫున ఏకంగా 72 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఈయన. 2025-26 సీజన్ ముగింపులో బేయర్న్ మ్యూనిచ్ క్లబ్ నుండి రిలీజ్ అయిన గోరెట్‌స్కాను.. జర్మనీ కెప్టెన్ జాషువా కిమ్మిచ్ స్వయంగా రెండు సార్లు బతిమిలాడి, పెనాల్టీ షూట్ తీసుకోమని అడిగాడు. అయినా సరే ప్రెజర్‌ను తట్టుకోలేక గోరెట్‌స్కా క్లియర్ కట్‌గా నో చెప్పేశాడు. ఒక సీనియర్ ప్లేయర్ ఇలాంటి క్రూషియల్ టైంలో బాధ్యత తీసుకోకపోవడంపై అభిమానులు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
నలుగురు మెయిన్ ప్లేయర్స్ భయపడి పారిపోవడంతో, చివరికి డిఫెండర్ అయిన జోనాథన్ తా ముందుకు రాక తప్పలేదు. తన ప్రొఫెషనల్ కెరీర్‌లోనే ఇప్పటివరకు ఒక్క పెనాల్టీ కిక్ కూడా కొట్టని జోనాథన్ తా, ఆ భారీ ప్రెజర్‌ను మోస్తూ కిక్ కొట్టాడు. కానీ ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం వల్ల అతని షాట్ కాస్తా టార్గెట్ మిస్ అయి బార్ పైనుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆ వెంటనే పరాగ్వే ప్లేయర్ జోస్ కెనాలే తన ఛాన్స్‌ను గోల్‌గా మార్చి హిస్టారికల్ విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. జర్మనీ తరఫున కై హావెర్ట్జ్, నిక్ వోల్టెమేడ్, జోనాథన్ తా ముగ్గురూ పెనాల్టీలను మిస్ చేశారు.
56
క్యూరసావోపై 7 గోల్స్‌తో స్టార్ట్.. చివరికి ఘోర ముగింపు
నిజానికి ఈ వరల్డ్ కప్‌లో కోచ్ జూలియన్ నాగెల్స్‌మాన్ లీడర్‌షిప్‌లో జర్మనీ అదిరిపోయే రేంజ్‌లో ఎంట్రీ ఇచ్చింది. గ్రూప్ స్టేజ్ ఫస్ట్ మ్యాచ్‌లోనే క్యూరసావోను 7-1 తో ఊచకోత కోసింది. కానీ ఆ తర్వాతే అసలు కథ రివర్స్ అయింది. ఐవరీ కోస్ట్‌పై ఎలాగోలా కష్టపడి గెలిచినా, చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఈక్వెడార్ చేతిలో 1-2 తో ఓడిపోయింది. పరాగ్వేతో జరిగిన ఈ మ్యాచ్‌లో జోనాథన్ తా ఎక్స్‌ట్రా టైంలో హెడర్ ద్వారా కొట్టిన ఒక సూపర్ గోల్‌ను వీడియో అసిస్టెంట్ రిఫరీ తప్పుగా డిక్లేర్ చేసింది. ఆ వివాదం నడుస్తుండగానే, ఇప్పుడు ప్లేయర్స్ పిరికితనం బయటపడటం జర్మనీ ఫుట్‌బాల్‌ను కోలుకోలేని అవమానంలోకి నెట్టేసింది.
66
దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆగ్రహం
ఈ దారుణ ఓటమిపై జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ స్పందిస్తూ.. "ఓటమి బాధించినా, మీ టీమ్ స్పిరిట్ చూసి దేశం గర్విస్తోంది" అని ట్వీట్ చేశారు. దీనిపై జర్మనీ మీడియా, అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. "ఇందులో గర్వపడటానికి ఏముంది? మన దేశం అన్ని రంగాల్లోనూ, ఫుట్‌బాల్‌లోనూ వెనకబడిపోతోంది. మన పిల్లలు జర్మనీని కేవలం ఓడిపోయే దేశంగానే చూస్తున్నారు" అంటూ జర్నలిస్ట్ మరియన్ హార్న్ తీవ్రంగా మండిపడ్డారు. వరల్డ్ కప్ హిస్టరీలో జర్మనీ రౌండ్ ఆఫ్ 16 దాటకుండా ఇలా వరుసగా మూడోసారి అవుట్ కావడం గమనార్హం.