షూటౌట్ సమయంలో నెదర్లాండ్స్ ఆటగాళ్లు జస్టిన్ క్లైవర్ట్, క్వింటన్ టింబర్, క్రిసెంసియో సమ్మర్‌విల్లే తమ కిక్‌లను గోల్స్‌గా మార్చడంలో ఫెయిల్ అయ్యారు. అటు మొరాకో టీమ్‌లో నైల్ ఎల్ అయ్నోయి, కెప్టెన్ అష్రఫ్ హకీమి కిక్‌లు కూడా మిస్ అయ్యాయి. అయితే, డచ్ ప్లేయర్ క్రిసెంసియో సమ్మర్‌విల్లే కొట్టిన ఐదో కీలక కిక్‌ను మొరాకో గోల్ కీపర్ యాసిన్ బోనో తన ఎడమ చేత్తో అద్భుతంగా డైవ్ చేసి అడ్డుకున్నాడు. దీంతో బోనో ఈ మ్యాచ్‌కు రియల్ హీరోగా నిలిచాడు. స్టేడియం మొత్తం మొరాకో అభిమానుల అరుపులతో హోరెత్తిపోయింది.
సైబారి హిస్టారికల్ గోల్
యాసిన్ బోనో సూపర్ సేవ్ తర్వాత, మొరాకో తరపున లాస్ట్ అండ్ డిసైడింగ్ కిక్ తీసుకోవడానికి ఇస్మాయిల్ సైబారి గ్రౌండ్‌లోకి వచ్చాడు. సైబారి ఎలాంటి ప్రెజర్ లేకుండా కూల్‌గా వచ్చి, డచ్ గోల్ కీపర్ బార్ట్ వెర్‌బ్రూగన్‌ను పూర్తిగా బురిడీ కొట్టించాడు. బంతిని పోస్ట్ ఎడమ మూలలోకి చాలా ఈజీగా పంపేసి నెట్‌ను తాకించాడు. అంతే, మొరాకో టీమ్ హిస్టారికల్ విక్టరీతో ప్రీక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. నెదర్లాండ్స్ ప్లేయర్స్ గ్రౌండ్‌లోనే ఏడుస్తూ కూలబడిపోగా, మొరాకో లవర్స్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయింది.