Healthy food: రోగినిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే...!

First Published | Dec 16, 2021, 2:50 PM IST

మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి సహాయపడుతుంది. దీని వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. మన దేశంలో చాలా మంది జింక్ తీసుకోవడం లేదట. మరి జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలేంటో ఓసారి చూద్దాం..

ఈ రోజుల్లో మనకు  రోగనిరోధక శక్తి చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఓ వైపు నుంచి  కరోనా మహమ్మారి వివిధ వేరియేషన్స్ లో.. మనపై దాడి చేయడానికి రెడీగా ఉంది. కాబట్టి.. దానిని తట్టుకోవాలంటే... మనం రోగ నిరోధక శక్తిని ెంచుకోవడం చాలా ముఖ్యం. మరి ఆ రోగనిరోధక శక్తి పెంచుకోవాలంటే మనం  ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..


రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి జింక్  తీసుకోవడం అవసరం. జింక్.. తీసుకోవడం వల్ల.. మన శరీరంలో ఏంజైమ్స్ అన్నీ యాక్టివ్ అవుతాయట. మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి సహాయపడుతుంది. దీని వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. మన దేశంలో చాలా మంది జింక్ తీసుకోవడం లేదట. మరి జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలేంటో ఓసారి చూద్దాం..

Latest Videos


షెల్ ఫిష్ లో జింక్ పుష్కలంగా ఉంటుందట. కాబట్టి.. వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలట. క్రాబ్, ష్రింప్, లాబ్ స్టర్ లను కూడా ఆహారంలో తీసుకోవచ్చట. దీనిలో.. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయట. కాబట్టి.. వీటిని కచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

రెడ్ మీట్ లో కూడా జింక్ పుష్కలంగా ఉంటుందట. దీనిలో.. విటమిన్ బీ12, ప్రోటీన్, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల రెడ్ మీట్ లో 4.8 గ్రాములు జింక్ ఉంటుందట.


చికెన్, కోడిగుడ్డులో కూడా జింక్ చాలా పుష్కలంగా ఉంటుందట. అంతేకాకుండా.. వీటిలో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందట. ఇవి తీసుకోవడం వల్ల మజిల్ కూడా పెరుగుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తాయి. 85 గ్రాముల చికెన్ లో 2..4 గ్రాముల జింక్ ఉంటుంది.
 

ఇక.. వెజ్ లో.. పప్పు ధాన్యాలు, బీన్స్  లలో కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో.. ఫ్యాట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. క్యాలరీలు, న్యూటియంట్స్ మాత్రం చాలా పుష్కలంగా ఉంటాయి. 164 గ్రాముల పప్పు ధాన్యాలయలో 2.5 గ్రాముల జింక్ ఉంటుంది.

జీడి పప్పు కూడా.. జింక్  పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు.. జీడి పప్పులో కాపర్, విటమిన్ కే, విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటాయి. రోజూ 4-5 జీడిపప్పు తినడం వల్ల.. బీపీ కంట్రోల్ లో ఉంటుందట. 28 గ్రాముల జీడిపప్పు లో 1.6 గ్రాముల జింక్ ఉంటుంది.

oats

బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు పుష్కలంగా జింక్  లభిస్తుందట. ఇది.. శీరరంలోని కొలిస్ట్రాల్ లెవల్స్ ని రెగ్యులేట్ చేస్తుందట. అర కప్పు వోట్స్ లో.. 1.3 గ్రాముల జింక్ లభిస్తుంది. 

click me!