Winter Foods:చలికాలంలో కోడిగుడ్డు ఎందుకు తినాలి..?

First Published Dec 11, 2021, 12:42 PM IST

చలికాలంలో వచ్చే సీజనల్ సమస్యలను మన దరిచేయకుండా చేయగల సత్తా కోడిగుడ్డులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు అధికంగా ఉండే గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. 

egg

కోడిగుడ్డు తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. అయితే.. చలికాలంలో ఈ ఉడకపెట్టిన కోడిగుడ్డు తినడం వల్ల.. మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఎన్నో రకాల జబ్బులను మనకు దూరం చేస్తుంది.
 

చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కోడిగుడ్లు ఎంతో ఇష్టమైన ఆహారం. ఉదయాన్నే గుడ్డు తినడం వల్ల.. కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దానితోపాటు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
 

చలికాలంలో వచ్చే సీజనల్ సమస్యలను మన దరిచేయకుండా చేయగల సత్తా కోడిగుడ్డులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు అధికంగా ఉండే గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మంచి ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది ఎముకలను బలపరుస్తుంది. కంటి చూపు మెరుగుపడేందుకు సహాయపడుతుంది.
 

పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు కోడిగుడ్డులో పుష్కలంగా ఉన్నాయి.గుడ్లలో కోలిన్ కంటెంట్ ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీన్ని ఉడకబెట్టినప్పుడు అందులోని విటమిన్లు మెదడును ఉత్తేజితం చేసి మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. రోజూ వేటాడిన గుడ్లు తింటే పిల్లలకు జ్ఞాపకశక్తి వేగంగా ఉంటుంది.

గుడ్లు అనేక  పోషక విలువలు ఉన్నాయి.  ఇది ప్రోటీన్, ఇనుము, విటమిన్లు A, B6, B12, ఫోలేట్, అమైనో ఆమ్లాలు, భాస్వరం , సెలీనియం చాలా ముఖ్యమైన అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (linolik, lurch యాసిడ్) కలిగి ఉంది. ఇది పెద్దల నుంచి పిల్లల వరకు అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. 

వైద్యులు చెప్పిన దాని ప్రకారం.. ఉడకపెట్టిన   గుడ్డులో కీలకమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ ఉంది, ఇది మన చర్మానికి మరియు కంటి చూపుకు మంచిది. అందుకే గుడ్లు పిల్లల నుంచి పెద్దల వరకు తినాలి.
 

ఉడికించిన గుడ్డు విటమిన్ డి కి మంచి సోర్స్. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది. ఇది విటమిన్ B ఐరన్ ఎక్కువగా కలిగి ఉంటుంది. తద్వారా హిమోగ్లోబిన్ స్థాయి పెంచడానికి సహాయపడుతుంది.
 

బరువు తగ్గాలి అనుకునేవారికి కూడా కోడిగుడ్డు మంచి ఆహారం. బ్రేక్ ఫాస్ట్ గా కోడిగుడ్డు తీసుకుంటే.. శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందడంతో పాటు.. బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. కోడిగుడ్డులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంతేకాకుండా ప్రోటీన్లు, కాల్షియం కూడా కలిగి ఉంటాయి.

click me!