ఇడ్లీలో ఉండే పోషకాహారం...
ఇండ్లీని మినపప్పు, రవ్వ లేదా బియ్యం ఉపయోగించి తయారు చేస్తారు. ఇడ్లీ పోషకవిలువను 50 గ్రాముల బరువు ఆధారంగా లెక్కించవచ్చు. 50 గ్రాముల ఇడ్లీలో 50 కేలరీలు, 2గ్రాముల ప్రోటీన్, 10 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 1 గ్రాము ఫైబర్, 0.5 గ్రాముల కొవ్వు, 15 మిల్లీ గ్రాముల కాల్షియం, 0.7 మిల్లీ గ్రాముల ఐరన్, 9 మిల్లీ గ్రాముల మెగ్నీషియం, 20 మిల్లీ గ్రాముల భాస్వరం, 23 మిల్లీ గ్రాముల పొటాషియం, 130 మిల్లీ గ్రాముల సోడియం కూడా ఉంటాయి. ఇడ్లీ తినడం వల్ల ఇవన్నీ మనకు యథాతథంగా లభిస్తాయి.