Hot Food : వేడి వేడి అన్నం, కూర తింటే ఏమౌతుంది?

Published : Feb 01, 2025, 10:39 AM IST

Hot Food : చాలా మంది చలికాలం, వానాకాలంలో వేడివేడిగా అన్నం లేదా ఇతర ఆహారాలను తినడానికే  ఇష్టపడతారు. కానీ వేడివేడిగా తింటే ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు. 

PREV
16
Hot Food :  వేడి వేడి అన్నం, కూర తింటే ఏమౌతుంది?

వేడివేడిగా తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అంటే అది అన్నమైనా, కూరైనా, టీ, కాఫీలు  ఇలా ఎలాంటి ఆహారాన్నైనా వేడివేడిగా తినడానికే బాగా ఇష్టపడతారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలా వేడివేడిగా తినడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుందట. 

26

చాలా మంది చాలా ఫాస్ట్ గా తింటారు. అలాగే వేడివేడిగా ఉన్నదాన్ని కూడా అలాగే నమలకుండా మింగేస్తుంటారు. కానీ వేడి ఆహారం మీ కడుపులోకి వెళ్లిన తర్వాత మీకు మంచి చేయడానికి బదులుగా చెడే చేస్తుంది. అందుకే వేడి ఆహారాన్ని తినడం మానేయాలంటారు ఆరోగ్య నిపుణులు. అసలు వేడివేడిగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

36

వేడి ఆహారాన్ని తినడం వల్ల వచ్చే సమస్యలు

జీర్ణ సమస్యలు

వేడివేడిగా తినడం మీకు ఎంతో ఇష్టమైనప్పటికీ.. ఇది మీ ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదు. ఎందుకంటే వేడి వేడి ఫుడ్ మీ జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. అంతేకాదు వేడివేడి ఫుడ్ ను తింటే మీ గొంతు, మూత్రపిండాల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీకు తెలుసా? వేడి ఫుడ్ ను ఎక్కువగా తింటే తిన్నది అరగకపోవడం వంటి జీర్ణ సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అంతటే గ్యాస్,  కడుపు నొప్పి, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. 

46

ఆకలి ఉండదు

వేడివేడిగా ఆహారాన్ని తింటే ఆకలి కూడా చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వేడి ఫుడ్ మీ కడుపును నింపకుండా చేసి మీకు ఆకలి తగ్గేలా చేస్తుంది. దీనివల్ల మీరు సరిగ్గా ఫుడ్ ను తీసుకోలేరు. దీంతో మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.  ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వేడివేడిగా ఆహారాన్ని తింటే ఆకలి తగ్గే సమస్య వస్తుంది. దీనివల్ల మీరు బాగా బరువు తగ్గడం, బలహీనంగా ఉండే సమస్యలు వస్తాయి. 

విటమిన్లు, ఖనిజ లోపాలు ఏర్పడతాయి

వేడివేడిగా ఫుడ్ ను తింటే  మీ శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు సరిగ్గా అందవు. కానీ ఇవి అందితేనే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వేడివేడిగా తింటే మీ శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపం ఏర్పడి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వేడివేడిగా తినడం మానుకోండి. 
 

56

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ

వేడి వేడి ఆహారాన్ని ప్రతిరోజూ తింటే మీ ఇమ్యూనిటీ పవర్ రోజురోజుకు బలహీనపడుతుంది. ఎందుకంటే వేడి ఫుడ్ ను తింటే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. దీంతో మీకు దగ్గు, జలుబు నుంచి సీజనల్ వ్యాధులు, ఇతర ప్రమాదకరమైన రోగాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. 

మానసిక ఆరోగ్యంపై ప్రభావం

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వేడి వేడి ఆహారం మానసిక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. వేడివేడిగా తింటే మీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఒత్తిడి, యాంగ్జైటీ వంటి సమస్యలు వస్తాయి. అందుకే వేడివేడిగా ఫుడ్ ను తినకూడదని అంటారు. 

66

వేడివేడి ఫుడ్ ను తినడం వల్ల సమస్యలు రావొద్దంటే ఏం చేయాలి? 

వేడి వేడి ఫుడ్ ను తినడం అలవాటు చేసుకోకూడదు. అలాగే మీ జీర్ణవ్యవస్థను బలంగా ఉంచే ప్రోబయోటిక్స్ ను పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాల లోపాలను తీర్చడానికి సప్లిమెంట్లను డాక్టర్ల సలహాతో తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ పెరిగేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అలాగే హెల్తీ ఫుడ్ ను రోజూ తినాలి.  

click me!

Recommended Stories