డయాబెటీస్ తో బాధపడుతున్నారా..? ఈ సూపర్ ఫుడ్స్ మీకోసమే..!

First Published | Jan 10, 2022, 10:15 AM IST

ఎలాంటి వ్యాధికి అయినా.. మంచి ఆహారం మందులాగా పనిచేస్తుంది. అందుకే.. ఆహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు

diabetic

డయాబెటీస్ ( మధు మేహం).. ఇది రానంత వరకే... ఒక్కసారి మన ఒంట్లోకి అడుగుపెట్టింది అంటే చాలు.. అది మనల్ని వదలిపెట్టదు. ఇక.. డయాబెటీస్ పేషెంట్స్.. ఏది పడితే అది తినడానికి ఉండదు. కనీసం అన్ని పండ్లు కూడా తినకూడదు. మరి.. ఈ చలికాలంలో.. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు.. ఎలాంటి ఆహారం తీసుకోవచ్చో నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూసేద్దాం.

covid

ఎలాంటి వ్యాధికి అయినా.. మంచి ఆహారం మందులాగా పనిచేస్తుంది. అందుకే.. ఆహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. ఇక.. షుగర్ పేషెంట్స్ విషయానికి వస్తే.. వారు.. తీసుకునే ఆహారం లో  గ్లైసమిక్ ఇండెక్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలట. ఒక్కో ఆహారం అది ఒక్కోలా ఉంటుందట. దానివల్ల.. మన రక్తంలో షుగర్ లెవల్స్ మారుతూ ఉంటాయి.


Polished rice

1.ముడి బియ్యం..

డయాబెటీస్ రోగులు.. సాధారణ అన్నం కాకుండా.. ముడి బియ్యం తో వండిన ఆహారం తీసుకోవాలి.  ఈ బియ్యం ఎక్కువగా పాలిష్ చేసి ఉండదు. పొట్టు ఉంటుంది. దీంతో.. వీటిలో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిలో గ్లైసమిక్ ఇండిక్స్ లెవల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి.. ఈ బియ్యం తో వండిన ఆహారాన్ని వారు తీసుకోవచ్చు.

2.నూనె..
గది ఉష్ణోగ్రత వద్ద.. లిక్విడ్ రూపంలో ఉండే.. నూనెలను మాత్రమే తీసుకోవాలి. గడ్డ కట్టే నూనెలను తీసుకోకూడదు. అంతేకాకుండా.. నట్స్ కూడా ప్రతిరోజూ తీసుకోవాలి. ఎందుకంటే.. వాటిలో కూడా సహజ నూనెలు ఉంటాయి.
 

3.తక్కువ ఫ్యాట్  ఉన్న డెయిరీ ప్రొడక్ట్స్..

తక్కువ ఫ్యాట్ ఉన్న డెయిరీ ప్రోడక్ట్స్ అంటే.. చీజ్, పెరుగు లాంటివి తినొచ్చు. ఇవి కూడా డయాబెటీస్ రోగులకు ఎలాంటి హాని చేయవు.  కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా తినేయవచ్చు.

4.పండ్లు..

మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే.. మన ఆహారంలో కచ్చితంగా.. పండ్లకు చోటు ఇవ్వాలి. షుగర్ పేషెంట్స్ కూడా కొన్ని రకాల పండ్లను తినేయవచ్చు. అరటి, మామిడి లాంటివి కాకుండా.. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్.. బ్యాలెన్స్డ్ గా ఉంచడంతోపాటు.. మనకు శక్తిని కూడా అందిస్తాయి.
 

roasted chickpeas

5.శెనగలు..

షుగర్ పేషెంట్స్.. ఎలాంటి సందేహం లేకుండా.. ఉడకపెట్టిన శెనగలను తీసుకోవచ్చు. వీటిలో గ్లైసమిక్ ఇండెక్స్ లెవల్స్ తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా.. ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ రోగులకు ఇది బెస్ట్ ఫుడ్ అని  చెప్పొచ్చు. ఉడకపెట్టుకొని తినొచ్చు. లేదంటే..  కొంచెం స్పైసీగా చేసుకొని అయినా తినేయవచ్చు.

6. పెసరపప్పు..

వీటితో పాటు.. పెసలు,, మూంగ్ దాల్ కూడా.. డయాబెటీస్ రోగులు ఎలాంటి సందేహం లేకుండా.. తినొచ్చు. దీనిలో.. సైతం ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. పసి పిల్లల నుంచి.. పెద్దల వరకు అందరూ ఆనందంగా వీటిని తినేయవచ్చు. 

Latest Videos

click me!