ఈ పండ్లలో ఉండే పెప్టిన్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్ బి6 అల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది. వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. రోజు రెండు లేదా మూడు తింటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలా అని అతిగా తింటే.. బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది.
అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవాళ్లు, రక్తప్రసరణ వ్యవస్థలో తేడా ఉన్నవాళ్లు కూడా అంజీరాను తీసుకుంటే చాలా మంచిది.