కీటో డైట్ పై జడేజా ఫన్నీ ట్వీట్.. అసలు ఏంటీ కీటో డైట్..?

First Published | Jan 8, 2022, 10:52 AM IST

నిజంగా.. జడేజా చెప్పినట్లు.. కీటో డైట్ చేస్తే..  అస్థిపంజరాల్లా తయారౌతారా..? అసలు ఏంటీ కీటో డైట్..? దీని గురించి అందరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఓసారి  చూద్దాం..
 

ఈ మధ్యకాలంలో మీరు ఎక్కువగా వినే ఉంటారు కీటో డైట్.  బరువు తగ్గాలి అనుకునే చాలా మంది.. ఈ డైట్ ఫాలో అవ్వడం మొదలుపెడుతున్నారు. ఈ కీటో డైట్ ఫాలో అయితే.. సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ  క్రమంలో.. ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజా.. ఓ సరదా ట్వీట్ చేశారు.

ఓ అస్థిపంజరం పక్కన ఫోటో దిగి.. తన స్నేహితుడు కోటీ డైట్ తీసుకొని.. ఇదిగో ఇలా అయ్యాడు అంటూ... ఫన్నీ ట్వీట్ చేశాడు. కాగా.. ఈ ట్వీట్.. నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు.. ఆ ఫన్నీ ట్వీట్ కి బాగా రెస్పాండ్ అయ్యారు.  నిజంగా.. జడేజా చెప్పినట్లు.. కీటో డైట్ చేస్తే..  అస్థిపంజరాల్లా తయారౌతారా..? అసలు ఏంటీ కీటో డైట్..? దీని గురించి అందరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఓసారి  చూద్దాం..


ఈ కీటో డైట్ ని 19వ  శతాబ్ధంలోనే పరిచయం చేశారు. మధుమేహాన్ని నియంత్రంచడం కోసం.. దీనిని అందుబాటులోకి తీసుకువచ్చారట. 1920లో.. మూర్ఛ వ్యాధితో ఇబ్బంది పడుతున్న పిల్లలకు.. మందులతో పనిలేకుండా.. ఈకీటో డైట్ తో.. నయం చేశారట.

ఈ డైట్ ముఖ్య లక్ష్యం ఏమిటంటే.. కార్బో హైడ్రేట్స్ ని తక్కువగా తీసుకోవడం. ఇది ఎలా పనిచేస్తుందంటే...  కీటో డైట్ శరీరంలోని గ్లూకోజ్ నుండి కీటోన్‌లకు డిపెండెన్సీని మారుస్తుంది. కార్బోహైడ్రేట్ ఆహారాల నుండి తీసుకోబడిన గ్లూకోజ్‌ను ఉపయోగించకుండా, శరీరం నిల్వ చేసిన కొవ్వుల నుండి ఉత్పత్తి చేయబడిన కీటోన్‌లను ఉపయోగిస్తుంది. అందుకే ఈ డైట్‌కి "కీటో డైట్" అనే పేరు వచ్చింది.

keto diet

మానవ శరీరం తక్కువ కార్బోహైడ్రేట్లను వినియోగించినప్పుడు, 3-4 రోజుల తర్వాత శరీరం మొత్తం గ్లూకోజ్‌ను ఉపయోగించినప్పుడు, అది శక్తి కోసం ప్రోటీన్లు , కొవ్వులను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు.. బరువు తగ్గడం మొదలౌతుంది. దీంతో.. సులభంగా బరువు తగ్గగలరు.


అయితే.. ఈ డైట్ ని దీర్ఘకాలంగా ఉపయోగిస్తే మాత్రం.. అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు, బోలు ఎముకల వ్యాధి, రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే ప్రమాదాన్ని కలిగి ఉంటాయి . ఇది పోషకాల లోపానికి కూడా దారితీయవచ్చు.

అంతేకాకుండా.. చాలా తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలు తీసుకోవడం వల్ల  మలబద్ధకం, తలనొప్పి, నోటి దుర్వాసన వంటి దుష్ప్రభావాలు కూడా కలిగే అవకాశం ఉంది.

దీని వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. కాబట్టి.. ఈ డైట్ గురించి పూర్తి గా తెలుసుకోకుండా... అటువైపు అడుగులు వేయకూడదు. వైద్యులను సంప్రదించి.. మీకు నిజంగా అది అవసరమో లేదో.. దానిని ఎలా చేయాలో.. మొత్తం తెలుసుకొని మాత్రమే.. ఆ డైట్ ప్రారంభించాలని నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos

click me!