చలికాలంలో పిల్లలకు కచ్చితంగా ఇవ్వాల్సిన ఆహారం ఇది...!

First Published | Nov 14, 2022, 12:42 PM IST

మరి ఈ చలికాలంలో పిల్లలు తరచూ జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే... వారికి కొన్ని రకాల ఆహారాలు కచ్చితంగా ఇవ్వాలట. అవేంటో ఓసారి చూద్దాం...

చలికాలం వచ్చింది అంటే చాలు... అందరూ జబ్బున పడుతూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. తరచుగా జ్వరం, జలుబు, దగ్గు లాంటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల.. ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ చలికాలంలో పిల్లలు తరచూ జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే... వారికి కొన్ని రకాల ఆహారాలు కచ్చితంగా ఇవ్వాలట. అవేంటో ఓసారి చూద్దాం...

1.స్వీట్ పొటాటో( చిలగడ దుంప)

చిలగడ దుంప... దీనినే స్వీట్ పొటాటో అని కూడా పిలుస్తారు.  వీటిలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఫైబర్, పొటాషియం, విటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది తినడానికి రుచికరంగా మాత్రమే కాదు... పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచడానికి కూడా సహాయం చేస్తుంది.


2.బెల్లం...
బెల్లం తినడాన్ని పిల్లలు కూడా  చాలా ఎక్కువగా ఇష్టపడతారు. పంచదారకి బదులుగా మనం బెల్లాన్ని ఉపయోగించవచ్చు.  ఈ బెల్లంలో ప్రోటీన్, విటమిన్ బి12, విటమిన్ బి6, ఫోలేట్, కాల్షియం, ఐరన్, ఇతర మినరల్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. ఇది కూడా పిల్లల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.

3.ఉసిరి...
చలికాలలో ఉసిరి కాయలు పుష్కలంగా లభిస్తాయి. ఈ ఉసిరి కాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చలికాలంలో పిల్లల్లో ఎక్కువగా వచ్చే జలుబు, దగ్గు, అరుగుదల సమస్యలు రాకుండా సహాయం చేస్తాయి.
 

dates

4.ఖర్జూరం...
ఖర్జూరాలు కూడా రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎక్కువగా సహాయం చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యత రాకుండా ఉండేలా చేస్తాయి. దీని వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.


5.సిట్రస్ పండ్లు...
సిట్రస్ ఎక్కువగా ఉండే పండ్లను ఈ కాలంలో అందరూ తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు ఇవ్వాలి. ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా ...వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి... విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆరెంజ్ లు, నిమ్మకాయ వంటి వాటిని వారి ఆహారంలో భాగం చేయాలి.

beetroot


6.బీట్రూట్...
దీనిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి కూడా బీట్రూట్ చాలా ఎక్కువగా సహాయం చేస్తుంది. రోగాలపై పోరాడే శక్తి వీటిలో ఎక్కువగా ఉంుటంది. రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది.

Latest Videos

click me!