కొబ్బరి నీరు ఏ సమయంలో తాగితే దివ్యౌషధంలా పనిచేస్తుంది..?

First Published Apr 14, 2021, 2:43 PM IST

కొబ్బరి నీరులో సహజ ఎంజైమ్స్, మినర్సల్ ఉంటాయి. అవి ఈ నీటి సూపర్ హెల్దీ డ్రింక్ గా మార్చేస్తాయి. ఇవి కాక కొబ్బరినీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం

ఎండాకాలం వచ్చేసింది. ఈ సమ్మర్ హీట్ తగ్గించుకునేందుకు చాలా మంది కొబ్బరి నీరు తాగుతారు. వేసవిలో కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని హీట్ ని ఇట్టే తగ్గించి కూల్ చేసే అద్భుతమైన లక్షణం దీనిలో ఉంది.
undefined
బరువు తగ్గాలి అనుకునేవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఎలాంటి షుగర్ కూడా దీనిలో యాడ్ చేయరు. కాబట్టి.. బరువు పెరుగుతారనే భయం కూడా ఉండదు.
undefined
కొబ్బరి నీరులో సహజ ఎంజైమ్స్, మినర్సల్ ఉంటాయి. అవి ఈ నీటి సూపర్ హెల్దీ డ్రింక్ గా మార్చేస్తాయి. ఇవి కాక కొబ్బరినీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
undefined
కొబ్బరికాయలో 94 శాతం నీరు, చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. 250 మి.లీ కొబ్బరి నీటిలో 9 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్, 2 గ్రాముల ప్రోటీన్, ఆర్డీఐ విటమిన్ సి 10 శాతం, ఆర్డీఐ మెగ్నీషియం 15 శాతం, ఆర్డీఐ మాంగనీస్ 17 శాతం, ఆర్డీఐ పొటాషియం 17 శాతం ఉన్నాయి. ఆర్‌డిఐ సోడియంలో 11 శాతం, ఆర్‌డిఐ కాల్షియంలో 6 శాతం ఉంటాయి.
undefined
మీ శరీరంలో చాలా ఫ్రీ రాడికల్స్ ఉన్నప్పుడు, ఆక్సీకరణ ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి, ఇది మీ కణాలను దెబ్బతీస్తుంది మరియు వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
undefined
ఓ సంస్థ చేసిన పరిశోధనలో కొబ్బరి నీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని కనుగొన్నారు, ఇవి ఫ్రీ రాడికల్స్‌ను సవరించగలవు, తద్వారా అవి హానికరం కాకుండా సహాయం చేస్తాయి.
undefined
మరో అధ్యయనంలో కాలేయం దెబ్బతిన్న ఎలుకలు కొబ్బరి నీటితో చికిత్స చేసినప్పుడు ఆక్సీకరణ ఒత్తిడిని మెరుగుపరుస్తాయని తేలింది.ఇదొక్కటే కాదు, కొబ్బరి నీటి వినియోగం ఎలుకలలో రక్తపోటు, ట్రైగ్లిజరైడ్ మరియు ఇన్సులిన్ స్థాయిలను తగ్గించింది.
undefined
కొబ్బరి నీరు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొబ్బరి నీళ్ళు ఇచ్చిన ఎలుకలలో హిమోగ్లోబిన్ ఎ 1 సి తక్కువ స్థాయిలో ఉందని ఎలుకలపై జరిపిన అధ్యయనంలో తేలింది. ఇది దీర్ఘకాలికంగా.. శరీరంలోని చెక్కర స్థాయిలను తగ్గిస్తుంది.
undefined
కొబ్బరి నీరులో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. టైప్ 2 డయాబెటిక్స్, ప్రీ డయాబెటిక్స్ ఉన్న వారి రక్తంలోని చెక్కర స్థాయిలను తగ్గిస్తుంది.
undefined
కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్నవారికి సైతం కొబ్బరినీరు అద్భుతంగా పనిచేస్తుంది. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలను కూడా పూర్తిగా తగ్గిస్తుంది.
undefined
చాలా మంది కొన్ని డ్రింక్స్.. ఈ టైమ్ లో తాగాలి.. ఆ టైమ్ లో తాగాలి అని చెబుతుంటారు. అయితే.. కొబ్బరి నీరు విషయంలో మాత్రం అలాంటివి ఉండవట.
undefined
రోజులో ఎప్పుడైనా కొబ్బరి నీరు ఎంజాయ్ చేయవచ్చు. రాత్రి వేళలో కూడా కొబ్బరి నీరు తాగొచ్చు. కొబ్బరి నీటిలో లారిక్ ఆమ్లం ఉన్నందున ఉదయాన్నే దీన్ని తాగడం మంచి ఎంపిక, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ జీవక్రియను ప్రారంభించడానికి.. బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తుంది.
undefined
గర్భిణీ స్త్రీలు, మలబద్ధకం సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీరు తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడతారు. అంతేకాదు.. మద్యం సేవించేవారు ఆ మందు హ్యాంగ్ ఓవర్ ను పొగట్టడానికి కొబ్బరి నీరు తాగితే సరిపోతుంది.
undefined
బాడీ డీ హైడ్రేట్ కాకుండా ఉండేందుకు.. వర్కౌట్స్ చేయడానికి ముందు కూడా కొబ్బరి నీరు తీసుకుంటే సరిపోతుంది.
undefined
click me!