కరోనా మహమ్మారి మన దేశంలో మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. లక్షల్లో కరోనా కేసులు నమోదౌతుండగా... వేలల్లో మరణాలు నమోదౌతున్నాయి. ఈ మహమ్మారి నుంచి బయటపడాలంటే.. రోగ నిరోధక శక్తి పెంచుకోవడం తప్పదని వైద్యులు సైతం సూచిస్తున్నారు.
కాగా.. తన వద్ద రోగ నిరోధక శక్తిని పెంచే కాక్ టైల్ ఉందంటున్నారు బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా.
తాను ప్రతిరోజూ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఉదాయన్నే కాక్ టైల్ తాగుతానని.. దానిని ఎలా తయారు చేసుకోవాలో కూడా ఆమె వివరించారు. అదెలా చేసుకోవాలో మనం కూడా ఓ లుక్కేద్దాం.
పసుపు, అల్లం, యాపిల్ సైడర్ వెనిగర్. ఈ మూడింటి కాంబినేషన్ తో తాను కాక్ టైల్ చేసుకుంటానని ఆమె పేర్కొన్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి
అల్లం కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా కడుపుని తేలికగా ఉంచుతుంది
ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చర్మం, జుట్టుకు కూడా మంచిది. వీటికి కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.