మీలో చాలా మంది చాలా రకాల టీలు తాగే ఉంటారు. ఏ టీ తాగినా ఫ్లేవర్స్ మారినా రుచికి మాత్రం తియ్యగానే ఉంటుంది. ఒక్క బ్లాక్ టీ తప్ప.. దాదాపు అన్ని టీ రుచులు ఒకేలా అనిపిస్తూ ఉంటాయి. టీ తయారు చేసేటప్పుడు మనం పంచదార వేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా టీలో ఉప్పు వేసుకొని తాగారా..? టీలో ఉప్పు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? అవును.. రోజూ మీరు తాగే టీలో ఒక చిటికెడు ఉప్పు వేసుకొని తాగాలట. ఇలా ఉప్పువేసి తాగడం వల్ల.. చాలా ప్రయోజనాలు ఉన్నాయట.
సాధారణంగా మనకు వాతావరణ మారగానే జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే... మనం రోజూ తాగే టీలో కనుక చిటికెడు ఉఫ్పు వేసుకొని తాగితే.. ఈ సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టేయవచ్చట. అంతేకాకుండా.. మన రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా సహాయపడుతుంది.
మనలో చాల మంది జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మలబద్ధం కామన్ ప్రాబ్లంగా మారిపోయింది. వాళ్లు కనుక టీలో చిటికెడు ఉప్పు వేసుకొని తాగితే.. వారి జీర్ణ సమస్యలన్నీ తగ్గిపోతాయట. కాబట్టి.. ఒకసారి ప్రయత్నించి చూడండి.
milk tea
ఈ సమ్మర్ లో ఎన్ని నీళ్లు తాగినా బాడీ డీ హైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. దీంతో.. డీ హైడ్రేషన్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ ఎండల్లో టీ తాగలేం కానీ.. తాగకుండా ఉండలేం అనుకునేవారు.. చిటికెడు ఉప్పు వేసుకొని తాగండి. ఇలా చేయడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఉప్పు సహజంగానే బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయం చేస్తుంది.
milk tea
ఉప్పు ని చాలా మంది కేవలం రుచికి మాత్రమే పని చేస్తుంది అనుకుంటారు. కానీ.. ఉప్పులో మెగ్నీషియం, సోడియం, కాల్షియం , పొటాషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే.. ఉప్పుని ఇలా తీసుకోవడం వల్ల.. మన మొత్తం ఆరోగ్యానికి సహాయపడుతుంది.
మీరు నమ్మరు కానీ.. టీలో ఉప్పు కలుపుకొని తాగడం వల్ల.. టీకి జింక్ యాడ్ అవుతుంది. అది.. మన చర్మాన్ని అందంగా మార్చడానికి సహాయపడుతుంది. మన డ్యామేజ్డ్ స్కిన్ ని రిపేర్ చేస్తుంది. మెటిమలు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. చర్మం మెరవడానికి సహాయపడుతుంది.
మనలో చాలా మంది మైగ్రేన్ వంటి తలనొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారికి ఈ మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం కలిగించడంలో... ఈ ఉప్పు కలిపిన టీ బాగా పని చేస్తుంది. మైండ్ ని రిలాక్స్ చేస్తుంది.
ఇక... టీలో ఉప్పేంటి అని మీరు ముఖం చిట్లించుకున్నా.. చిటికెడు ఉప్పు.. పెద్దగా మీ టీని ఉప్పగా ఏమీ మార్చదు.పైగా టీ రుచిని మరింతగా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి.. ఒకసారి ఇలా కూడా ప్రయత్నించి చూడండి.