మామిడి తొక్కే కదా అని తీసిపారేయకండి.. దీనితో చాలా లాభాలున్నాయి..!

First Published Apr 12, 2024, 9:42 AM IST

తొక్కలో ఏముంది తొక్క అని తీసిపారేయకండి. అందులోనే అసలైన న్యూట్రియంట్స్ దాగి ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. మామిడి తొక్క మనకు ఎన్ని విధాలుగా ఉఫయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 

సమ్మర్ వచ్చింది అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మామిడికాయ. ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా.. మామిడి పండ్లు తినొచ్చు అని ఎదురుచూసేవారు చాలా మందే ఉంటారు. పండ్లలో రారాజు అయిన మామిడిని దాదాపు అందరూ ఇష్టపడతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే... కమ్మగా తియ్యని మామిడి పండు తినేటప్పుడు మనం ఏం చేస్తాం..? దాని మీద తొక్క తేసేసి ముక్కలు మాత్రమే తింటూ ఉంటాం. మీరు కూడా తొక్క తీసేసి పండు తింటున్నట్లయితే... ఆ పని ఇప్పటితో ఆపేయండి. ఎందుకంటే... తొక్కలో ఏముంది తొక్క అని తీసిపారేయకండి. అందులోనే అసలైన న్యూట్రియంట్స్ దాగి ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. మామిడి తొక్క మనకు ఎన్ని విధాలుగా ఉఫయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మామిడి పండు నోట్లో పెట్టుకుంటే కమ్మగా ఉంది కానీ.. దాని తొక్క తినడం కష్టంగా ఉందని చాలా మంది చెబుతుంటారు. అయితే మామిడి ముక్కతో తినకపోయినా.. ఆ తొక్కతో డీటాక్స్ డ్రింక్ గా తయారు చేసుకోవచ్చు. నీటిలో మామిడి తొక్కలు వేసి మరిగించి.. టీ రూపంలో తాగేయవచ్చు. దీంట్లో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. మీ షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో చాలా కీలకంగా పని చేస్తాయి. డయాబెటిక్స్ తో బాధఫడేవారు.. ఈ మ్యాంగో పీల్ టీ లేదంటే.. డీటాక్స్ డ్రింక్ తాగడం అలవాటు చేసుకుంటే..వారి షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది..

లేదు... మా ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఎవరూ లేరు.. మాకు ఈ మామిడి తొక్కతో పనిలేదు కదా పారేయవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు.  అయితే.. ఇతర విధాలుగా కూడా దీనిని వాడొచ్చు. నిజానికి మామిడి తొక్కలు సహజ పురుగుల మందుగా.. మొక్కలకు వాడొచ్చు. ఈ మామిడి తొక్కలో మాంగిఫెరిన్, బెంజోఫెనోన్ లు ఉంటాయి, ఇవి.. క్రీములు కీటకాలు మొక్కలదరి చేరకుండా అడ్డుకుంటాయి.  బయట మార్కెట్లో లభించే పురుగుల మందులు వాడి పంటలను విషంగా మార్చే బదులు.. ఈ మామిడి తొక్కలను వాడి.. క్రిమి కీటకాలను దూరం చేయడంతోపాటు.. ఆరోగ్యకరమైన ఆహారాలను పండించవచ్చు.

Mango

మామిడికాయ తొక్క మంచి సన్ స్క్రీన్ లోషన్ గా పని చేస్తుందని మీకు తెలుసా? నార్మల్ గా మనం ఎండలో బయటకు వెళ్లే సమయంలో యూవీ కిరణాల నుంచి  రక్షణ పొందేందుకు సన్ స్క్రీన్ రాసుకుంటూ ఉంటాం. అయితే.. ఈ మామిడి తొక్కలను పేస్టులా మార్చి రాసుకుంటే కూడా మనకు యూవీ కిరణాల నుంచి రక్షణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Mango

మామిడి కాయ తొక్కలో బయోఆక్టివ్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. వాటిలో యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీలు కూడా ఉంటాయి.  ఇవి మన ఓరల్ హెల్త్ అంటే.. నోటి ఆరోగ్యానికి ఎక్కువగా సహాయం చేస్తాయి. మామిడి తొక్కలను నమలడం వల్ల.. లేదా దానితో తయారు చేసిన మౌత్ వాష్ వాడినా కూడా.. నోరు శుభ్రపడుతుంది. దంత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

అంతేకాదు.. మామిడి తొక్కలో క్యాన్సర్ రాకుండా కూడా రక్షించగలదు. మామిడి తొక్కలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీలు ఉంటాయి.  ఇవి.. క్యాన్సర్ కి కారణమయ్యే కణాలను క్షీణించేలా చేస్తాయి. మరి.. ఇన్ని ఉపయోగాలు ఉన్న.. మామిడి తొక్కలను ఈ సారి నుంచి బయటపడేయకండి. 

click me!