ఈ కూరగాయల్ని తింటే.. మీరు మరింత అందంగా కనిపిస్తారు

First Published | Nov 14, 2024, 12:57 PM IST

ఈ కాలంలో అమ్మాయిలు అందంగా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని రకాల కూరగాయల్ని తింటే మాత్రం మీరు ఎన్నటికీ తరగని అందాన్ని పొందుతారని నిపుణులు అంటున్నారు. అవేంటంటే? 

skin care

చర్మ సంరక్షణ సరిగ్గా లేకపోతే ఎన్నో రకాల చర్మ సమస్యలు వేధిస్తుంటాయి. కేవలం జాబ్ చేసే ఆడవాళ్ల నుంచి ఇంట్లో ఉండే ఆడవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ తమ ముఖాన్ని అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దీనికోసం ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన బ్యూటీ టిప్స్ ను ఫాలో అవుతుంటారు. 

అయితే చాలా మంది అందంగా కనిపించాలనే ఉద్దేశంతో మార్కెట్ లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కానీ వీటివల్ల అలెర్జీ, మొటిమలతో పాటుగా ఇతర చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. బయటి నుంచి చర్మాన్ని మీరు ఎంత అందంగా మార్చినా వేస్టే.

ఎందుకంటే ఇది కొద్దిసేపటి వరకు మాత్రమే మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తుంది. అదే లోపలి నుంచి అందంగా మార్చితే మీ అందానికి ఏ డోకా ఉండదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల కూరగాయలు మన చర్మానికి మంచి పోషణను అందిస్తాయి. దీంతో మన చర్మం అందంగా, కాంతివంతంగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


వెజిటేబుల్స్

మనం ప్రతిరోజూ ఎన్నో రకాల కూరగాయల్ని తింటుంటాం. అయితే వీటిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మనం తినే ప్రతి కూరగాయలో మన శరీరానికి శక్తినిచ్చే పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని అందంగా, కాంతివంతంగా చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆకుకూరలు

ఆకు కూరల్లో మన ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూర, కాలె, క్యాబేజీ వంటి ఆకు కూరల్లో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.

ఈ ఆకు కూరల్ని ఫ్రై చేసి తిన్నా, లేదా సూప్, వెజిటబుల్ సలాడ్స్ ఇలా ఎలా తిన్నా మీ శరీరానికి ఎనర్జీ అందుతుంది. ఇక ఈ ఆకు కూరల్లో ఉండే పోషకాలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే చర్మం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా ఇవి శరీరానికి హాని చేసే ట్యాక్సిన్స్ ను తొలగిస్తాయి. 

tomatoes

టమాటా

మనం చేసే ప్రతి కూరలో టమాటా ఖచ్చితంగా ఉంటుంది. టమాటాలో విటమిన్ సి, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన చర్మాన్ని అందంగా మార్చేస్తాయి.

ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. టమాటాలను తింటే ముఖంపై ఉన్న గీతలు, మరకలు, మొటిమలు తగ్గుతాయి. ఇందుకోసం టమాటాలను బాగా తినాలి. కావాలనుకుంటే మీరు టమాటా ఫేస్ ప్యాక్ ను కూడా వాడొచ్చు. 
 

క్యారెట్లు

క్యారెట్లలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిని తింటే మన శరీరం బలంగా ఉండటమే కాకుండా.. చర్మం కాంతివంతంగా అవుతుంది.

క్యారెట్లలో విటమిన్ సితో పాటుగా ఎన్నో ముఖ్యమైన పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరానికి హానికలిగించే యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి క్యారెట్లను అలాగే తినొచ్చు. లేదా జ్యూస్ గా చేసుకుని తాగొచ్చు. 

click me!