షుగర్ లెవెల్స్ నుంచి బరువును తగ్గించడం వరకు.. చలికాలంలో మెంతికూరను తింటే ఎన్ని ప్రయోజనాలున్నాయో..!

First Published | Nov 18, 2023, 2:46 PM IST

మెంతి ఆకుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి ఫుడ్ రుచిని పెంచడంతో పాటుగా మనల్ని ఎన్నో రోగాల నుంచి రక్షించడానికి కూడా సహాయపడతాయి. అందుకే వీటిని చలికాలంలో తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

చలికాలంలో ఎన్నో రకాల కూరగాయలు మార్కెట్ లో దొరుకుతాయి. వీటిలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉపయోగించి ఎన్నో రుచికరమైన వంటలను తయారుచేయొచ్చు. ఇలాంటి వాటిలో మెంతికూర ఒకటి. చలికాలంలో మెంతికూరను ఎన్నో రకాల వంట్లో ఉపయోగిస్తారు. చాలా మంది బంగాళాదుంప మెంతికూరను ఎక్కువగా తింటుంటారు. ఈ కూర టేస్టీగా ఉండటమే కాకుండా మనల్ని ఎన్నో రోగాల నుంచి కూడా రక్షిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. చలికాలంలో మెంతికూరను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ 

డయాబెటీస్ పేషెంట్లకు మెంతిఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకుల్లో ఉండే ఔషద లక్షణాలు బ్లడ్ షుగర్ లెవల్స్ ను నార్మల్ గా ఉంచడానికి సహాయపడుతాయి. మీరు డయాబెటిస్ పేషెంట్ అయితే ఈ చలికాలంలో వీటిని మీ డైట్ లో ఖచ్చితంగా చేర్చండి. 


బరువు తగ్గడానికి

మెంతి ఆకులు మీరు బరువు తగ్గడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఈ చిన్న ఆకులు బరువును తగ్గించడంలో ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. మీరు బరువు సులువుగా తగ్గుతారు. 
 

జీర్ణ ఆరోగ్యం 

మారుతున్న సీజన్ లో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. ఇది చాలా కామన్. అయితే మెంతి ఆకులను తింటే ఈ సమస్యలు వచ్చే అవకాశమే ఉండదు. ఈ పచ్చి ఆకులు అజీర్ణం, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. మెంతి ఆకులతో చేసిన ఆహారాలను తింటే ప్రేగు కదలికలు మెరుగ్గా ఉంటాయి. మలబద్దకం సమస్య ఉండదు. 
 

రోగనిరోధక శక్తి

ఆకుకూరల్లో ఉండే విటమిన్లు, మినరల్స్ మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. చలికాలంలో మెంతిఆకులను తినడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాం. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
 

గుండె ఆరోగ్యం 

చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికి మెంతి ఆకులు అద్బుతంగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఈ ఆకుల్లో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. 

fenugreek

ఎముకలకు మేలు 

మెంతి ఆకుల్లో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది. దీనిలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

Latest Videos

click me!