ఈ కాలం పిల్లలకు స్నాక్స్ అంటే ఏవేవో ఫుడ్స్ తింటున్నారు. ఎక్కువగా కేకులు, పిజ్జాలు, బర్గర్లు లాగించేస్తూ ఉంటారు. కానీ... ఒకప్పుడు ఎక్కువగా పల్లీలు, వేయించిన శెనగలు మాత్రమే తినేవారు. కానీ ఈ రోజుల్లో వాటిని తినడం నామూషీగా ఫీలౌతున్నారు. కానీ.. వీటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలేంటో మనమూ తెలుసుకుందాం..
వేయించిన శెనగలు రోజూ గుప్పెడు తినాలి. ఇలా తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీటిలో ప్రోటీన్ చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత... కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. మజిల్ రిపైర్ కి ఎంతగానో సహాయపడుతుంది.
అంతేకాదు.. ఈ శెనగల్లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. డైజెస్టివ్ హెల్త్ కి సహాయపడుతుంది. కడుపు ఎక్కువ సేపు నిండిన అనుభూతి కలుగుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఇక.. ఈ వేయించిన శెనగల్లో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి.. బరువు పెరుగుతాం అనే భయం ఉండదు. కాబట్టి.. సంతోషంగా ఆస్వాదించవచ్చు.
అంతేకాదు.. ఈ వేయించిన శనగల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఎనర్జీ లెవల్స్ కాపాడుకోవడానికి వీటిని ఎప్పుడు కావాలంటే అ్పుడు తినవచ్చు.
roasted chana
ఇది స్నాక్స్ గా మాత్రమే కాదు.. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఫోలేట్, ఐరన్, పాస్పరస్, మాంగనీస్ లతో పాటు... శరీర ఆరోగ్యానికి అవసరమైన అన్ని న్యూటియంట్స్ ఇందులో ఉంటాయి.
అంతేకాదు.. ఈ వేయించిన శెనగల్లో.. ఫైబర్ తో పాటు..లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి.. హార్ట్ ఆరోగ్యానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. కొలిస్ట్రాల్ లెవల్స్ మేనేజ్ చేయడంతోపాటు... గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలోనూ సహాయపడతాయి.
ఈ శెనగల్లో కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్ ఉండటం వల్ల.. షుగర్ లెవల్స్ ని మేనేజ్ చేయడానికి సహాయపడతాయి. డయాబెటిక్ పేషెంట్స్ ఈ శెనగలను తినడం వల్ల షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు.
ఇక.. ఈ శెగలను డిఫరెంట్ కాంబినేషన్స్ లో అంటే.. నచ్చిన మసాలాలతో వీటిని ఆస్వాదించవచ్చు. ఇక.. వీటిని స్టోర్ చేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. చాలా సులభం. ఇంటిల్లపాది వీటిని కమ్మగా ఆస్వాదించవచ్చు.