ఈ కూరగాయలను తింటున్నారా? అయితే మీకు గుండెపోటు రిస్క్ తక్కువే..

First Published Jan 30, 2024, 12:56 PM IST

ప్రస్తుత కాలంలో గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా ఎంతో మంది దీని భారిన పడి అర్థాంతరంగా చనిపోతున్నారు. అయితే కొన్ని కూరగాయలు గుండెపోటు నుంచి మనల్ని రక్షిస్తాయని నిపుణులు అంటున్నారు. అవేంటంటే? 

మన శరీరమంతా రక్తాన్ని పంప్ చేయడం మన గుండె ప్రధాన పని. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. కానీ కొన్నిసార్లు మన లైఫ్ లో మనం చేసే కొన్ని పొరపాట్లు మన గుండె పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. నిలకడగా కొట్టుకుంటున్న మన గుండె ఆ తర్వాత తన బీట్ ను మార్చుకుంటుంది.
 

vegetables

ధూమపానం, ఆల్కహాల్, కొవ్వు ఆహారాలు దీనికి ప్రధాన కారణాలంటున్నారు నిపుణులు. అలాగే గుండెజబ్బులు రావడానికి మన అనారోగ్యకరమైన జీవనశైలి కూడా ఒక ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. అందుకే మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఏ జబ్బూ రాదట. ముఖ్యంగా కొన్ని కూరగాయలను తింటే గుండె ఆయుష్షు పెరుగుతుందట. అవేంటో తెలుసుకుందాం పదండి. 

ఆకుకూరలు

ఆకుకూరలు మన గుండెకే కాదు మన మొత్తం శరీరానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. ఈ ఆకు కూరల్లో మాంసకృత్తులు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరానికి హని చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. అలాగే మన గుండె ఆరోగ్యాన్ని రక్షించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి.
 

Image: Freepik

టమాటాలు

టమాటాలను  మనం ప్రతి కూరలో వేస్తుంటాం. కానీ టమాటాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె జబ్బులను నయం చేస్తుంది.  అలాగే అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది. అందుకే దీన్ని మీ రోజువారి ఆహారంలో తప్పకుండా చేర్చండి. టమాటాతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. 
 

avocado

అవొకాడో

అవొకాడోలో పోషకాలు, ముఖ్యంగా పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును త్వరగా తగ్గిస్తుంది. అలాగే కొరోనరీ ధమనులలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. దీనివల్ల మీ గుండెకు ఎలాంటి ప్రమాదం ఉండదు. దీన్ని తింటే గుండెజబ్బులొచ్చే రిస్క్ తగ్గుతుంది. 
 

బ్రొకోలీ

బ్రొకోలీ మన గుండెకు  చాలా చాలా మంచిది. దీనిలో విటమిన్లు, ఫైబర్ తో పాటుగా ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ కూరగాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, కార్డియోవాస్క్యులర్ లక్షణాలు ఉంటాయి. ఇలాంటి బ్రోకలీని క్రమం తప్పకుండా తినడం వల్ల మీరు గుండె సమస్యల నుంచి బయటపడొచ్చు. 
 

capsicum

క్యాప్సికమ్

క్యాప్సికమ్ మనకు ఎన్నో కలర్స్ లో లభిస్తాయి. ఈ క్యాప్సికమ్ లో విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే ఎన్నో గుండె సంబంధిత సమస్యలను నివారిస్తాయి. అందుకే దీన్ని మీ రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోండి.

click me!