వీళ్లు బచ్చలికూర అస్సలు తినొద్దు

First Published | Oct 22, 2024, 11:45 AM IST

బచ్చలికూర మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కానీ కొంతమందికి మాత్రం ఇది విషంలా పనిచేస్తుంది. అందుకే వీళ్లను ఈ కూర తినొద్దంటారు. 

శీతాకాలం మొదలవగానే చాలా మంది ఇండ్లల్లో బచ్చలికూర గుమగుమ వాసన వస్తుంటుంది.  ఈ బచ్చలికూర జస్ట్ రుచికే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది బచ్చలికూరను పప్పులో వేసి తింటుంటారు.  ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది.

బచ్చలికూర ఆకుకూరల్లో ఐరన్, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి.

ఈ కూర మన ఆరోగ్యానికి ఎంతటి మేలు చేసినా.. ఇది కొందరికి మాత్రం విషం లాగే పనిచేస్తుంది. అవును కొంతమంది దీన్ని తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. లేనిపోని సమస్యలు వస్తాయి. 

బచ్చలికూరను తినడం వల్ల వచ్చే సమస్యలు

బచ్చలికూర టేస్టీగా ఉన్నప్పటికీ.. దీన్ని తింటే మూత్రపిండాల్లో రాళ్లు, ఫుడ్ అలెర్జీలు, జీర్ణ వ్యవస్థ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. అందుకు బచ్చలికూను ఎవరెవరు మర్చిపోయి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


ఎవరు బచ్చలికూర తినకూడదు?

యూరిక్ యాసిడ్ సమస్య:  యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు బచ్చలికూరను తినకూడదు. ఎందుకంటే బచ్చలికూరలో ఉండే ప్యూరిన్ అనే మూలకం శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను బాగా పెంచుతుంది. దీని వల్ల మీకు కీళ్ల నొప్పులు బాగా పెరుగుతాయి. అందుకే మీరు ఇప్పటికే యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్నా లేదా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నా బచ్చలికూర తినకపోవడమే మంచిది. 

రక్తం సన్నబడే మందులు తీసుకుంటుంటే: మీరు ఇప్పటికే రక్తం సన్నబడటానికి మందులు తీసుకుంటుంటే పొరపాటున కూడా బచ్చలికూరను తినకూడదు. ఎందుకంటే బచ్చలికూరలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. అయితే ఇది రక్తం సన్నబడటానికి మందులతో ప్రతిస్పందిస్తుంది. కాబట్టి ఇలాంటి వారు బచ్చలికూరను తినకూడదు.
 

కిడ్నీ స్టోన్

చాలా మందికి మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు కూడా బచ్చలికూరను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బచ్చలికూరలో  ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది  కిడ్నీ స్టోన్స్ ను మరింత పెంచుతుంది. అందుకే వీళ్లు బచ్చలికూరను తినకూడదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుంది

బచ్చలికూర ఆరోగ్యానికి మంచిదే. అయినప్పటికీ బచ్చలికూర, కాలే వంటి ఆకుపచ్చని కూరగాయలలో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కానీ వీటిలో ఉండే ఆక్సలేట్ కాల్షియంతో బంధించబడుతుంది. అలాగే ఇది మీ శరీరంలో కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుంది.
 

spinach 2

అలెర్జీ

కొంతమందికి బచ్చలికూర అలెర్జీ ఉంటుంది. నిపుణుల ప్రకారం.. బాగా పండిన బచ్చలికూరను లేదా పచ్చి ఆకులను తినడం వల్ల కొంతమందికి అలెర్జీలు వస్తాయి. కొన్నిసార్లు బచ్చలికూరకు అలెర్జీలు నోటి అలెర్జీ సిండ్రోమ్ల మాదిరిగానే ఉంటాయి. ఇలాంటప్పుడు హాస్పటల్ కు ఖచ్చితంగా చూపించుకోవాలి.
 

click me!