గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకొని నెల రోజులపాటు తాగితే జరిగేది ఇదే..
నిమ్మకాయ రసం పరగడుపున తీసుకోవడం వల్ల మన శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల స్థాయిని పెంచుతుంది. అంతేకాదు.. మీకు ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు శక్తివంతంగా భావిస్తారు. మీ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది.అంతేకాదు మీ జీవక్రియ మెరుగుపడుతుంది. ఈజీగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. నెల రోజుల పాటు రోజూ తాగడం వల్ల.. బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది.
1 నెల పాటు ఖాళీ కడుపుతో నిరంతరం నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోయి శరీరం టాక్సిన్ ఫ్రీ అవుతుంది.
శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడి ముఖం మెరుపు కోల్పోవడం మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు 1 నెల పాటు నిరంతరంగా ఈ పానీయం తాగితే, శరీరం నిర్విషీకరణ చెందుతుంది.ముఖం మెరుస్తుంది. తెలీకుండానే ముఖంలో అందం పెరుగుతుంది.