పల్లీలను వీళ్లు మాత్రం తినకూడదు. తింటే సమస్యే

First Published | Oct 4, 2024, 4:20 PM IST

వేరుశెనగలు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. దీంట్లో మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉంటాయి. అయినప్పటికీ.. వేరుశెనగలను కొంతమంది అస్సలు తినకూడదు. 

ఇడ్లీ, దోశ, బోండ, వడ ఇలా ప్రతి టిఫిన్ లోకి పల్లీ చట్నీని చేస్తుంటారు. ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ప్రతి టిఫిన్ లోకి పల్లీ చట్నీనే చాలా మంది తినడానికి  ఇష్టపడతారు. ఈ వేరుశెనగల్లో  ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు  పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి.

అయితే పల్లీలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.. వీటిని కొంతమంది అస్సలు తినకూడదన్న ముచ్చట మీకు తెలుసా? ఒకవేళ తింటే ఆరోగ్య ప్రయోజనాల కంటే హానే ఎక్కువ జరుగుతుంది. 
 

పల్లీలను ఎవరు తినకూడదు? 

ఎసిడిటీ

ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య ఉన్నవారు మాత్రం పల్లీలను పొరపాటున కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీళ్లు పల్లీలు తింటే మలబద్ధకం వచ్చే సమస్య పెరుగుతుంది. అలాగే పల్లీలు గ్యాస్, ఎసిడిటీ,  కడుపునొప్పి, అజీర్ణం, విరేచనాలు వంటి కడుపునకు సంబంధించిన సమస్యలు మరింత పెరిగేలా చేస్తాయి. 

యూరిక్ యాసిడ్ 

పల్లీల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని పెంచుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీకు ఇప్పటికే ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు లేదా హైపర్యూరిసెమియా సమస్యతో బాధపడుతున్న వారు పల్లీలను ఎక్కువ మొత్తంలో తినకూడదు. ఎందుకంటే పల్లీలు తింటే పరిస్థితి మరింత దిగజారుతుంది. 

హై బీపీ..

అధిక రక్తపోటు తేలిగ్గా తీసుకోవాల్సిన సమస్య కాదు. ఇది ప్రాణాంతక సమస్య ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు వేరుశెనగలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే వేరుశెనగలు టేస్టీగా అనిపించడానికి జనాలు సోడియాన్ని ఎక్కువగా కలుపుతున్నారు. ఉప్పుతో వేయించిన పల్లీలను లేదా వేరుశెనగ వెన్న తిన్నా మీ రక్తపోటు మరింత పెరుగుతుంది. ఒకవేళ మీరు వేరుశెనగలను తినాలనుకుంటే ఉప్పు లేకుండా తినకడానికి ప్రయత్నించండి. 

Latest Videos


శరీరంలో మంట

వేరుశెనగల్లో ఎక్కువ మొత్తంలో ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. కానీ ఒమేగా -3 కాదు. కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిదికాదు. అంటే ఈ అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో అసమతుల్యత వల్ల మీ శరీరంలో మంట కలుగుతుంది. 

ఖనిజ శోషణ

పల్లీలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఉపయోగపడినా.. ఇది మీ శరీరంలో ఖనిజ శోషణను నిరోధించే అవకాశం ఉంది. వేరుశెనగలో ఉండే కాల్షియం, ఫైటిక్ ఆమ్లం, ఇనుము, జింక్, మెగ్నీషియం శోషణను నిరోధిస్తుంది. దీనివల్ల ఫైటేట్లు ఖనిజ లోపాలు ఏర్పడతాయి. అలాగే పేగు మార్గంలో  అలెర్జీ, చికాకు వంటి సమస్యలు కూడా వస్తాయి. 

బరువు తగ్గడానికి

బరువు తగ్గాలనుకునే వారు పల్లీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వేరుశెనగలో కొవ్వులు, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది మీరు బరువు పెరిగేలా చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే మాత్రం పల్లీలను తినకండి. 

అలెర్జీ

చాలా మందికి వేరుశెనగల అలెర్జీ ఉంటుంది. ఇలాంటి వారు పొరపాటున పల్లీలను తింటే శరీర వాపు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అనాఫిలాక్సిస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు కూడా  వేరుశెనగల అలెర్జీ ఉంటే దీనిని అస్సలు తినకండి. 

పల్లీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

గుండె ఆరోగ్యానికి మంచిది: ఏహెచ్ఏ జర్నల్ లో ఒక నివేదిక ప్రకారం.. పల్లీలను లిమిట్ లో తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో మీ గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అంతేకాదు ఇది మీ శరీరంలో హైబీపీ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుంది. పల్లీల్లో ఫైబర్ కంటెంట్, మోనోశాచురేటెడ్ కొవ్వు, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుది. కాబట్టి ఇది గుండెకు మంచిదని చెప్తారు. 

డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:  పల్లీలు డయాబెటీస్ రిస్క్ ను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే చెడు కొవ్వు కూడా ఉండదు. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పల్లీల్లో ఉండే  మెగ్నీషియం ఇన్సులిన్ నిరోధకతను నియంత్రించడానికి సహాయపడుతుంది. 
 


ఎన్నో క్యాన్సర్లను నివారిస్తుంది:  పల్లీలను తింటే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ కూడా చాలా వరకు తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పల్లీల్లో మంచి మొత్తంలో విటమిన్ ఇ, ప్రోటీన్ ఉంటుంది. అంతేకాదు పల్లీల్లో రెస్వెరాట్రాల్ కూడా మెండుగా ఉంటుంది. ఇది పాలీఫెనోలిక్ యాంటీఆక్సిడెంట్ కాబట్టి ఇది క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది: పల్లీలు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. వీటిలో ఉండై ఫైబర్, ప్రోటీన్ మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పల్లీలను తింటే మీ ఒంట్లో శక్తి పెరుగుతుంది. అలాగే ఆకలి కూడా అదుపులో ఉంటుంది. 

click me!