మీరు వంట ఎలా చేస్తున్నారు..? ఇలా మాత్రం చేయకండి..!

First Published | Oct 4, 2024, 3:26 PM IST

నువ్వు వండే కూరగాయ ఎంత మంచిది అయినా...వండే పద్దతి సరిగా లేకపోతే.. ఆ కూరగాయలోని పోషకాలు మనకు అందవు. మరి.. ఎలాంటి పద్దతిలో వంట చేయకూడదో తెలుసుకుందాం...

ఉదయం లేవగానే మనం ఏం చేసినా చేయకపోయినా.. కడుపులో ఆకలి మాత్రం గంట కొట్టేస్తుంది. ఈ భూమి మీద ప్రతి మనిషికి ఆకలి అనేది ఉంటుంది. ఆ ఆకలి తీర్చుకునేందుకు ఎవరికి నచ్చిన ఆహారం వారు తింటూ ఉంటారు. ఆ ఆహారమే లేకుంటే.. మనం జీవించలేం అనేది కూడా అక్షర సత్యం. అయితే.. మనం తినాలంటే ఎవరో ఒకరు వంట చేయాలి కదా... వంట చేయడం అంటే,.. ఏది పడితే అది వేసి వండేయలేం. దానికంటూ ఓ పద్దతి ఉంటుంది. ఓ కళారూపం చెక్కినంత పద్దతిగా వంట చేయాలి. ఏ వంటకు అయినా ఓ పద్దతి ఉంటుంది. దేనిని ఎలా వండాలో అలా వండితేనే దానికి రుచి వస్తుంది.. అది తిన్నప్పుడు మనకు ఆరోగ్యం కూడా వస్తుంది. అయితే... ఈ మధ్యకాలంలో వంట చేసే పద్దతి చాలా సులువు అయ్యింది. మన కంఫర్ట్ కి తగినట్లు... అన్ని పద్దతులను మార్చేశారు. కానీ... అలా మార్చి కొన్ని రకాలుగా వంట చేయడం వల్ల.. మన ఆరోగ్యాన్ని మనమే ముప్పులో పడేస్తున్నాం. నువ్వు వండే కూరగాయ ఎంత మంచిది అయినా...వండే పద్దతి సరిగా లేకపోతే.. ఆ కూరగాయలోని పోషకాలు మనకు అందవు. మరి.. ఎలాంటి పద్దతిలో వంట చేయకూడదో తెలుసుకుందాం...


అనారోగ్యకరమైన  వంట చేసే పద్దతులు ఇవే...

అనారోగ్యకరమైన వంట అనగానే చాలా మందికి ముందు గుర్తుకొచ్చేది డీప్ ఫ్రై.  డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ ఆరోగ్యానికి మంచిది కాదని..వాటిలో ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయని మనం అనుకుంటారు. కానీ.. దానికంటే... ఆరోగ్యకరమైన వంట విధానాలు ఉన్నాయి. వాటిని మనం హెల్దీ అనుకొని పొరపాటుగా తింటున్నాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం....
 


1.ఎయిర్ ఫ్రయ్యర్...

ఈ మధ్యకాలంలో ఆయిల్ లేకుండా వంట చేయాలని.. అది హెల్దీ అనుకొని.. చాలా మంది ఎయిర్ ఫ్రయ్యర్ లు  వాడేస్తున్నారు. దీంట్లో నూనె ఉండదు కదా హెల్దీ అనుకుంటూ ఉంటారు. సాంప్రదాయ డీప్ ఫ్రైయింగ్ లాగా కాకుండా, ఎయిర్ ఫ్రయ్యర్లు ఆహారాన్ని వండడానికి వేడి గాలిని ఉపయోగించుకుంటాయి, తక్కువ నూనెతో సారూప్య ఆకృతిని అందిస్తాయి. అయినప్పటికీ, కొన్ని నూనెలను ఉపయోగించడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ ఉత్పత్తి అవుతాయి, ఇది మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే, గాలి ప్రసరణ అసమాన వంటకి కారణమవుతుంది, ఇది తక్కువగా లేదా అతిగా ఉడకబెట్టిన భాగాలకు దారితీస్తుంది.

2.గ్రిల్లింగ్...

 ఆహారాన్ని వండడానికి గ్రిల్లింగ్ ని కూడా ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు.  గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ పనీర్ , గ్రిల్స్ ఫిష్ మనకు ఇష్టమైన కొన్ని స్నాక్స్. కానీ అధిక ఉష్ణోగ్రతల వద్ద, బహిరంగ మంట మీద గ్రిల్ చేయడం వల్ల హెటెరోసైక్లిక్ అమైన్‌లు (HCAలు)  పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు (PAHలు) అనే హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి. ఈ సమ్మేళనాలు కొన్ని తీవ్రమైన అనారోగ్యాలతో ముడిపడి ఉన్నాయి.
 

nonstick pan

3.నాన్ స్టిక్ ప్యాన్...
ప్రపంచంలోని అన్ని వంటశాలలను నాన్-స్టిక్ పాన్‌లు స్వాధీనం చేసుకున్నాయి. అవి ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటాయి. తక్కువ నూనెతో ఆరోగ్యకరమైన భోజనాన్ని పూర్తి చేయవచ్చు అనుకుంటారు.  కానీ నాన్-స్టిక్ ప్యాన్‌లు తరచుగా టెఫ్లాన్ అని పిలువబడే పాలిటెట్రాఫ్లోరోఎథిలిన్ (PTFE)  పూతను కలిగి ఉంటాయి. ఈ ప్యాన్‌లను వేడెక్కడం లేదా వాటిపై మెటల్ పాత్రలను ఉపయోగించడం వల్ల విషపూరిత పొగలు, కణాల విడుదలకు కారణమవుతుంది.

4.మైక్రోవేవ్...

మైక్రోవేవ్ లో వంట చేయడం కూడా ఈ మధ్యకామన్ అయిపోయింది. దీని వల్ల పోషకాల నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. మైక్రోవేవ్ లో  వేడి చేయడం, పర్టిక్యులర్ కంటైనర్లు వాడటం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ... దాని నుంచి రసాయనాలు విడుదలౌతాయట. అది ఆహారాన్ని కాలుష్యం చేస్తుంది. దీని వల్ల.. మనకు నష్టాలు కలుగుతాయి. కాబట్టి... మైక్రోవేవ్ లో ఫుడ్ తినడం కూడా.. ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

Latest Videos

click me!