ఈ వ్యాధి ఉన్నవారు ఖర్జూరాలను తినకూడదు.. ఎందుకంటే?

First Published | Sep 10, 2023, 4:26 PM IST

నిజానికి ఖర్జూరాల్లో ఎన్నో పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ కొన్ని అనారోగ్య సమస్య ఉన్నవారు వీటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే? 
 

Image: Freepik

డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండ్లలో ఖర్జూరం ఒకటి. ఖర్జూరాలను తింటే ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. ఖర్జూరాల్లో  గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ లతో పాటుగా విటమిన్ సి, విటమిన్ బి1,విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5ఎ1 వంటి పోషఖాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు ఈ డ్రై ఫ్రూట్ లోఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఖర్జూరాలు మనకు మేలు చేసినప్పటికీ.. వీటిని మోతాదులోనే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

dates

ఖర్జూరాలను తింటే మనలో ఎన్నో పోషకాల లోపం పోతుంది. అయినా వీటిని లిమిట్ లోనే తినాలి. ఎందుకంటే ఖర్జూరాలను ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే కడుపు సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఫుడ్ అలెర్జీ ఉన్నవారు, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (ఐబిఎస్) ఉనోళ్లు ఖర్జూరాలను లిమిట్ లోనే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


dates

ఖర్జూరాలను మరీ ఎక్కువగా తింటే కొందమందికి కడుపులో అసౌకర్యం కలుగుతుంది. ఇంకొంతమందికైతే పరిగడుపున వీటిని తింటే కడుపు నొప్పి వస్తుంది. అయితే ఖర్జూరాల్లో ఉండే ఫైబర్స్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల కొంతమందికి గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది. అలాగే కడుపు నొప్పి వస్తుంది. 

ఫుడ్ అలెర్జీలు లేదా విరేచనాలు వంటి సమస్యలు ఎక్కువగా వచ్చేవారు ఖర్జూలను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తినాలనుకుంటే మాత్రం చాలా తక్కువగా తినాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్నవాళ్లు డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే ఖర్జూరాలను తినడం మంచిది. 

ప్రకోప ప్రేగు సిండ్రోమ్ అనేది సాధారణంగా జీవనశైలి రుగ్మతల వల్ల వచ్చే వ్యాధి. మీరు తినే ఆహారం, శారీరక శ్రమ, విశ్రాంతి, నిద్ర వంటివి సక్రమంగా లేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ప్రకోప ప్రేగు సిండ్రోమ్ సమస్య ఉన్నవారే కాదు డయాబెటిస్ పేషెంట్లు కూడా ఖర్జూరాలను లిమిట్ లోనే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఖర్జూరాల్లో సహజ చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 
 

అయితే ఖర్జూరాల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీకు తెలుసా? ఖర్జూరాలు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఖర్జూరాల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రించడానకి సహాయపడతాయి. దీంతో మీకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
 

ఖర్జూరాల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు మన ఎముకల్నీ, కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఖర్జూరాల్లో ఉండే విటమిన్ సి, విటమిన్ డి ఎన్నో చర్మ సమస్యలను తగ్గిస్తాయి. చర్మ సమస్యలు రాకుండా చేస్తాయి. ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ తో కూడా పోరాడతాయని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరాలను తింటే అలసట అనేదే ఉండదు. ఇవి మన కండరాల బలాన్ని కూడా పెంచుతాయి.

Latest Videos

click me!