పరగడుపున ఈ పండ్లను మాత్రం తినేయవచ్చు..!

First Published | Sep 8, 2023, 3:54 PM IST

అందుకే పండ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. రోజంతా మీకు కావలసిన శక్తిని , విటమిన్లను కూడా అందిస్తుంది

నిజానికి పరగడుపున పండ్లను తినడం అంత మంచిది కాదని చెబుతుంటారు. కానీ, కొన్ని పండ్లను మాత్రం పరగడుపున తినవచ్చట.ఈ పండ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది రోజు ప్రారంభించడానికి కూడా మంచి మార్గం. అందుకే పండ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. రోజంతా మీకు కావలసిన శక్తిని మరియు విటమిన్లను కూడా అందిస్తుంది.
 


అరటి 
అరటి పొటాషియం కి మంచి మూలం. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంతోపాటు కండరాలు సక్రమంగా పని చేయడంలో సహాయపడుతుంది. ఇవి తేలికగా జీర్ణమవుతాయి.
 
 



ఆపిల్
ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తినడం మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. యాపిల్స్‌లోని పీచు పదార్ధం నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తుంది, ఇతర ఆహారాలు త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి.


పుచ్చకాయ 
పుచ్చకాయ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు హైడ్రేటెడ్‌గా ఉండటానికి కూడా సహాయపడుతుంది. అలాగే, ఇందులో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి మంచిది.
 

బొప్పాయి..
 బొప్పాయిలో పాపైన్ కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది.. ఇందులో పోషకాలు కూడా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
 


కివి
కివీ పండులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె కంటెంట్ ఉంటుంది. ఇందులో ఎంజైమ్‌లు ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
 

బెర్రి..
పీచు పదార్థం ఎక్కువగా ఉన్న మరో పండు బేరి. ఇది జీర్ణక్రియకు మంచిది. కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఇది విటమిన్ కె, పొటాషియంతో సహా విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది.

Latest Videos

click me!