
కాలీఫ్లవర్ సూపర్ టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. ఈ కూరగాయను బిర్యానీలో వేయడమే కాకుండా.. పకోడీ చేసుకుని కూడా తింటుంటారు.
చాలా మంది కాలీఫ్లవర్ కుర్మాతో పాటుగా రకరకరాల వంటలు చేసుకుని తింటుంటారు. ఇది టేస్టీగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
కాలీఫ్లవర్‌లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ప్రోటీన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి.
నిజానికి కాలీఫ్లవర్ మన ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఇది కొంతమందికి మాత్రం అస్సలు మంచిది కాదు. వీళ్లకు ఇది విషంలా పనిచేస్తుంది. అవును కొన్ని సమస్యలతో బాధపడుతున్నవారు కాలీఫ్లవర్ ను తింటే ఆ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఇంతకీ ఎవరు కాలీఫ్లవర్ ను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కాలీఫ్లవర్ ను ఎవరు తినకూడదు :
గ్యాస్ & అసిడిటీ ఉన్నవారు
ఈ రోజుల్లో చాలా మంది గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వీళ్లు మాత్రం కాలీఫ్లవర్ ను పొరపాటున కూడా తినకూడదు. ఎందుకంటే కాలీఫ్లవర్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి అంత తొందరగా జీర్ణం కావు. దీనివల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉన్నవారు కాలీఫ్లవర్ తినకపోవడమే మంచిదంటారు ఆరోగ్య నిపుణులు. ఒకవేళ తింటే ఇది మీకు జీర్ణ సమస్యలు వస్తాయి.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు
థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా కాలీఫ్లవర్ అస్సలు తినొద్దంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే దీని వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మరింత దెబ్బతింటుంది. అలాగే ఈ గ్రంథిలో హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు
మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు కూడా కాలీఫ్లవర్ తినకూడదంటారు డాక్టర్లు. ఎందుకంటే కాలీఫ్లవర్‌లో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనివల్ల కిడ్నీల్లో రాళ్ల సైజు మరింత పెరుగుతుంది. అంతేకాదు కాలీఫ్లవర్ ను ఎక్కువ తింటే మీ శరీరంలో యూరిక్ యాసిడ్ కూడా పెరుగుతుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు కూడా కాలీఫ్లవర్ ను తినకూడదు.
గుండెపోటు
గుండెపోటు ప్రాణాంతక వ్యాధి. అయితే ఒకసారి గుండెపోటు వచ్చిన వారు కూడా కాలీఫ్లవర్ ను తినకూడదు. ఎందుకంటే వీళ్లు రక్తం పలుచబడే మందులు వాడుతుంటారు. కాబట్టి వీళ్లు కాలీఫ్లవర్ ను ఎక్కువగా తినకూడదంటారు. ఎందుకంటే కాలీఫ్లవర్‌లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టేలా చేస్తుంది.
గర్భిణులు & పాలిచ్చే తల్లులు
గర్భిణులు, పాలిచ్చే తల్లులు కూడా కాలీఫ్లవర్ ఎక్కువగా తినకూడదంటారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో కాలీఫ్లవర్ ను తింటే వాంతులు, వివారం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు దీనివల్ల తల్లికి, పుట్టబోయే బిడ్డకు కూడా హాని కలిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇకపోతే పాలిచ్చే తల్లులు కూడా కాలీఫ్లవర్ ను తినకూడదు. ఒకవేళ తింటే పిల్లలకు కడుపు నొప్పి వస్తుంది.
గమనిక : పైన చెప్పిన సమస్యలు ఉన్నవారు కాలీఫ్లవర్ తినాలనుకుంటే ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి. .