తాజా పండ్లు తిన్నప్పుడు మన శరీరానికి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో.. డ్రై ఫ్రూట్స్ లోనూ అంతే ప్రయోజనం కలుగుతాయి. డ్రై ఫ్రూట్స్ లో ఖర్జూరానికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పొచ్చు. ఈ ఖర్జూరాన్ని తినడం వల్ల.. మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఎండు ఖర్జూరంలో క్యాలరీల శాతం కాస్త ఎక్కువగానే ఉంటుంది.
ఎప్పుడైనా శక్తి కోల్పోయినట్లు, నీరసంగా అనిపిస్తే ఒక్క ఖర్జూరం తిన్నా.. వెంటనే ఎనర్జీ వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఈ ఖర్జూరంలోని క్యాలరీలలో ఎక్కువ భాగం కార్బో హైడ్రేట్స్ నుంచే వస్తుంది. మిగిలినవి చాలా తక్కువ మొత్తంలో ప్రోటీన నుంచి వస్తాయి. అయితే.. ఈ ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి.