కాకరకాయ కూర చాలా చేదుగా ఉంటుంది. అందుకే చాలా మంది దీన్ని తినరు. కానీ కాకర రుచి చేదుగా ఉన్నా దీనిలో ఉండే ఎన్నో ఔషదగుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాకరకాయను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దీని జ్యూస్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ కాకరకాయను కొంతమంది మాత్రం ఎట్టిపరిస్థితిలో తినకూడదు. ఒకవేళ తిన్నారంటే అంతే సంగతి. అసలు కాకరకాయను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రక్తంలో చక్కెర
బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా సమస్యే. అయితే రక్తంలో చక్కెర స్థాయిలు మరీ తక్కువగా ఉన్నవారు ఎట్టిపరిస్థితిలో కాకరకాయను అస్సలు తినకూడదు. ఎందుకంటే కాకరకాయను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు మరింత తగ్గుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవాళ్లు కాకరకాయను తినాలని డాక్టర్లు చెప్తుంటారు.
గర్భిణులు
ప్రెగ్నెన్సీ టైంలో కూడా కాకరకాయను అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇది పుట్టబోయే పిల్లలకు హాని కలిగిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో కాకరకాయను తినాలనుకుంటే మీరు డాక్టర్ ను సంప్రదించిన తర్వాత మాత్రమే తినండి.
కాలేయ వ్యాధి
కాకరకాయ జ్యూస్ ను తాగితే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ కాలెయానికి సంబంధించిన వ్యాధులు ఉంటే మాత్రం కాకరకాయను అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇది కాలేయంలో ఫ్రోటీన్ ప్రసరణను ఆపివేస్తుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
నీళ్ల విరేచనాలు
కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. అలాగని దీన్ని మోతాదుకు మించి అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే మీకు ఎన్నో సమస్యలు వస్తాయి. వీటిలో డయేరియా ఒకటి. కాకరకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా సమస్యలు వస్తాయి. ఇప్పటికే మీకు ఈ సమస్య ఉంటే కాకరకాయను పొరపాటున కూడా తినకండి.
పొత్తికడుపు నొప్పి
కాకరకాయను తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే కాకరకాయను రెగ్యులర్ గా తిన్నా.. లిమిట్ లోనే తినండి. లేదంటే పొత్తికడుపు నొప్పి వస్తుంది.
జ్వరం, తలనొప్పి
జ్వరం, తలనొప్పి ఉన్న సమయంలో కొన్ని ఆహారాలను అస్సలు తినకూడదు. ఇలాంటి వాటిలో కాకరకాయ ఒకటి. అవును జ్వరంగా ఉన్నప్పుడు, తలనొప్పితో బాధపడుతున్నప్పుడు కాకరకాయను తినకూడాదు. ఒకవేళ తింటే ఈ రెండు సమస్యలు మరింత పెరుగుతాయి.