మీ అందాన్ని పెంచే సమ్మర్ డ్రింక్స్ ఇవి....!

First Published | Apr 11, 2024, 2:21 PM IST

ఈ కింది డ్రింక్స్ తాగితే మనకు.. ఎండ నుంచి హాయి రావడమే కాదు... మన చర్మ సౌందర్యం కూడా పెరుగుతుందట. మరి.. అలాంటి డ్రింక్స్ ఏంటో ఓసారి చూద్దాం..
 

ఈ మండే ఎండల్లో మనకు చల్ల చల్లగా డ్రింక్స్ తాగాలని అనిపిస్తూ ఉంటుంది.   అలా అని కూల్ డ్రింక్స్ తాగితే.. ఆ క్షణం హాయిగా అనిపించినా.. తర్వాత.. అనారోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి, కాబట్టి.. వాటికి దూరంగా ఉంటాం. అయితే.. అవి కాకుండా.. మనకు ఈ ఎండల్లో హాయిని అందించే చాలా డ్రింక్స్ ఉన్నాయి. వాటిల్లో ఈ కింది డ్రింక్స్ తాగితే మనకు.. ఎండ నుంచి హాయి రావడమే కాదు... మన చర్మ సౌందర్యం కూడా పెరుగుతుందట. మరి.. అలాంటి డ్రింక్స్ ఏంటో ఓసారి చూద్దాం..
 

coconut water

1.కొబ్బరి నీళ్లు..
మనకు ఎండాకాలం అంటే ముందు గుర్తుకొచ్చేది కొబ్బరి నీళ్లే.  ఈ నీళ్లు తాగగానే మనకు ఎక్కడలేని ఎనర్జీ, హాయి వచ్చేస్తాయి. ఈ కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి.. ఈ కొబ్బరి నీరు తాగడం వల్ల.. మన చర్మం చాలా స్మూత్ గా మారుతుంది. రోజూ కొబ్బరి నీరు తాగితే.. మీ చర్మం అందం కూడా పెరుగుతుంది. మరింత యవ్వనంగా మారుతుంది.


2.బెర్రీ స్మూతీ..
మామూలుగానే మనకు స్మూతీలు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. ఇక ఈ మండే ఎండల్లో మనం స్మూతీలు తాగకుండా ఎలా ఉంటాం. అయితే.. మామూలు స్మూతీ కాకుండా.. బెర్రీలతో చేసిన స్మూతీ తాగి చూడండి. ఇవి సీజనల్ ఫ్రూట్స్. వీటిలో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని చాలా స్మూత్ గా.. ఒకకరకమైన గ్లోని కూడా అందిస్తాయి.


3.పైనాపిల్; ఆరెంజ్ స్క్వాష్..
మిమ్మల్ని యవ్వనంగా, మీ చర్మాన్ని అందంగా మార్చడంలో , చర్మాన్ని మెరిసేలా చేయడంలో.. ఈ డ్రింక్ కీలక పాత్ర పోషిస్తుంది.  పైనాపిల్, ఆరెంజ్ స్క్వాష్ మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది ఎండల్లో మనకు మంచి ఫ్రెష్ నెస్ ఇస్తుంది. అంతేకాకుండా.. ఈ రెండు పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది తాగడం వల్ల.. మన చర్మంపై ఉండే మచ్చలు, పిగ్మెంటేషన్ తొలగించడంలో సహాయం చేస్తాయి. రుచి కూడా చాలా బాగుంటుంది.
 

mint

4.పుదీనా, అల్లం టీ..
ఈ ఎండల్లో మనకు పుదీనా చాలా మంచి రిఫ్రెష్నెస్ ఇస్తుంది. ఇక అల్లంలోనూ చాలా రకాల హీలింగ్ ప్రాపర్టీలు ఉన్నాయి.  ఈ రెండూ కలిపి తయారు చేసుకునే టీని ఈ ఎండల్లో తాగడం వల్ల.. మన అందం పెరుగుతుంది. మన చర్మం అందంగా కనిపించడానికి ఇవి సహాయం చేస్తాయి.

5.బెర్రీ అండ్ లెమన్..
ఎండల్లో బెర్రీ, లెమన్.. ఈ రెండు మంచి ఫ్రెష్ నెస్ అందిస్తాయి. ఈ రెండింటితో కలిపి చేసే డ్రింక్ తాగడం వల్ల తాజా అనుభూతి కలుగుతుంది. ఇది మన బాడీ నుంచి టాక్సిన్స్ తొలగించడానికి సహాయం చేస్తుంది. అదేవిధంగా చర్మం మెరిసిపోవడానికి సహాయపడుతుంది.

6.యాపిల్, దాల్చిన చెక్క డ్రింక్స్..
యాపిల్, దాల్చిన చెక్క వాటర్ తో కలిపి తయారు చేసిన డ్రింక్ కూడా.. ఈ ఎండలకు మనకు మంచి తాజాదనాన్ని ఇస్తుంది. మన అందాన్ని కూడా పెంచుతుంది. ముఖంపై ఉండే డార్క్ స్పాట్స్, మొటిమలు, దానితాలుకు మచ్చలు, రెడ్ నెస్ అన్నీ తగ్గించడంలోనూ ఇది చాలా బాగా పని చేస్తుంది. కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ తొలగించడమే కాదు.. కళ్లు ఉబ్బినట్లుగా అనిపించినా అవి కూడా మాయం చేసేస్తుంది.

butter milk

7.మజ్జిగ..
అందరి ఇంట్లో సులభంగా లభించే బెస్ట్ సమ్మర్ డ్రింక్ ఇది. ఇదే డ్రింక్ లో కాస్త పుదీనా కూడా వేసుకొని తాగితే.. మరింత తాజాదనం యాడ్ అవుతుంది. మజ్జిగే కదా అని తీసిపారేయకండి.. రోజూ తాగడం వలల.. మన చర్మం సహజంగా అందంగా మెరిసేలా మారుతుంది. ముఖంపై ట్యాన్ తొలగిపోతుంది. డార్క్ స్పాట్స్ తొలగిపోతాయి. ఎండ నుంచి చర్మాన్ని కాపడటంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది.  కాబట్టి.. ఈ ఎండల్లో ఏ డ్రింక్ తాగకపోయినా రోజూ గ్లాస్ మజ్జిగ తాగడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

Latest Videos

click me!