గ్రీన్ టీని ఎవరు తాగకూడదో తెలుసా?

First Published | Jan 6, 2025, 10:19 AM IST

బరువు తగ్గేందుకు చాలా మంది గ్రీన్ టీని తాగుతుంటారు. కానీ కొంతమంది మాత్రం గ్రీన్ టీని అస్సలు తాగకూడదు. వాళ్లు ఎవరు? ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

గ్రీన్ టీ సైడ్ ఎఫెక్ట్స్

నిజానికి గ్రీన్ టీ చాలా మంచిది. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే ఈ రోజుల్లో పాలు, పంచదార కలిపిన టీ కంటే గ్రీన్ టీనే చాలా మంది తగ్గుతున్నారు. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

గ్రీన్ టీని తాగితే మన జీవక్రియ పెరుగుతుంది. దీంతో బరువు తగ్గుతారు. అలాగే దీనిలో ఉండే లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. అంతేకాదు గ్రీన్ టీ తాగితే ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గుతాయి. అంతేకాదు  ఈ గ్రీన్ టీ మన చర్మానికి కూడా మంచి మేలు చేస్తుంది. 

గ్రీన్ టీ సైడ్ ఎఫెక్ట్స్

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గ్రీన్ టీ డయాబెటీస్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

గ్రీన్ టీ తాగితే మన గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇది అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తాగితే హైబీపీ లెవెల్స్ నార్మల్ అవుతాయి. ఇవేకావు గ్రీన్ టీ వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

కానీ మనం మంచిదనుకునే ఈ గ్రీన్ టీ అందరికీ మంచి చేయదు. దీన్ని ఎక్కువగా తాగడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే కొంతమంది దీన్ని తాగడం వల్ల ఎన్నో సమస్యల బారిన పడతారు. అందుకే గ్రీన్ టీని ఎవరు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఇది కూడా చదవండి:  డోర్ మ్యాట్ లను శుభ్రం చేయడానికి ఈ ఒక్కటి చాలు..


గ్రీన్ టీ ఎవరు తాగకూడదు

తలనొప్పి ఉన్నవారు:

చాలా మంది తలనొప్పిని తగ్గించుకోవడానికి టీ, కాఫీలు తాగుతుంటారు. కొంతమంది గ్రీన్ టీని కూడా తాగుతుంటారు. కానీ ఈ గ్రీన్ టీ అన్ని సమస్యలకు మంచిదే అయినా.. తలనొప్పికి మాత్రం మంచిది కాదు. తలనొప్పి ఉన్నప్పుడు గ్రీన్ టీని తాగకపోవడమే మంచిది. ఎందుకంటే దీనిలో ఉండే కెఫిన్ కంటెంట్ తలనొప్పిని మరింత పెంచుతుంది. అందుకే రోజుకు ఒక కప్పు కంటే ఎక్కువ గ్రీన్ టీని తాగకూడదు. దీనికంటే ఎక్కువ తాగితే మీ సమస్య మరింత పెరుగుతుంది. అందుకే  రోజుకు 2-3 కప్పుల గ్రీన్ టీ తాగితే తలనొప్పి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. 

రక్తహీనత ఉన్నవారు:

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. శరీరంలో ఐరన్ లేకపోతే రక్తహీనత సమస్య వస్తుంది. మీకు గనుక ఒంట్లో రక్తం తక్కువగా ఉంటే మాత్రం మీరు గ్రీన్ టీని తాగకూడదు. ఎందుకంటే గ్రీన్ టీ మీ శరీరం ఇనుమును గ్రహించకుండా చేస్తుంది. దీనివల్ల రక్తహీనత సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అందుకే మీరు రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగకూడదు.

గ్రీన్ టీ ఎవరు తాగకూడదు

అసిడిటీ సమస్య ఉన్నవారు:

గ్యాస్, ఎసిడిటీ ఉన్నవారు కూడా గ్రీన్ టీని తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తాగినా ఎక్కువగా తాగకూడదు. ఎందుకంటే దీనిలో ఉండే కడుపులో ఆమ్లాన్ని పెంచుతుంది. దీంతో మీకు వికారం, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాగే గ్యాస్,మలబద్దకం, కడుపులో మంట వంటి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. 

గర్భిణులు & బాలింతలు:

బాలింతలు, గర్భిణులు కూడా గ్రీన్ టీని తాగకూడదు. ఎందుకంటే దీనిలో ఉండే కెఫిన్ కంటెంట్ గర్భధారణ సమస్యలను కలిగిస్తుంది. వీళ్లు రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగితే మాత్రం గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అలాగే బాలింతలు గ్రీన్ టీని ఎక్కువగా తాగితే నవజాత శిశువు ఆరోగ్యం దెబ్బతింటుంది. 

ఇది కూడా చదవండి: జుట్టుకు కలర్ ఎక్కువగా వేస్తే ఏమౌతుందో తెలుసా?

గ్రీన్ టీ

వీళ్లు కూడా గ్రీన్ టీ తాగకూడదు:

1. నిద్రలేమి సమస్య ఉన్నవారు గ్రీన్ టీని తాగొద్దు. 

2. అలాగే డాక్టర్ ను సంప్రదించకుండా గుండె జబ్బులు ఉన్నవారు గ్రీన్ టీని తాగకూడదు. 

3. బీపీ ఎక్కువగా ఉన్నవాళ్లు గ్రీన్ టీని ఎక్కువగా తాగొద్దు. 

4. డాక్టర్ ను సంప్రదించకుండా కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా గ్రీన్ టీని తాగకూడదు. 

5. లివర్ సమస్యలు ఉన్నవారు కూడా డాక్టర్‌ని సంప్రదించకుండా గ్రీన్ టీ తాగకూడదు.

Latest Videos

click me!