నెయ్యి పోషకాల గని. రెగ్యులర్ గా మన ఆహారంలో భాగం చేసుకోగల ఒక సూపర్ ఫుడ్ ఇది. నెయ్యి తినడం వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నెయ్యిలో.. హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అంతేకాదు.. మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్లు.. A, D, E, K వంటి పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి.
నెయ్యి శరీరానికి అవసరం అయిన పోషకాలను అందించడానికి, ఆరోగ్యకరమైన కొవ్వును మెరుగుపరచడానికి.. అనేక రకాల సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. నెయ్యి రోజుకు అవసరమైన విటమిన్ ఈలో 11 శాతం, విటమిన్ ఏ లో 100 శాతం అందిస్తుంది. ఇందులో బ్యూట్రిక్ యాసిడ్, ఒక ముఖ్యమైన షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది. అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో , ఒలేయిక్ యాసిడ్ కూడా ఉంటుంది.