ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్స్ తింటే తొందరగా బరువు తగ్గుతారు

First Published | Oct 14, 2024, 11:13 AM IST

బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమందికి మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేసేటంత సమయం అసలే ఉండదు. అయితే ఇలాంటి వారు ఉదయాన్నే కొన్ని డ్రై ఫ్రూట్స్ ను తింటే తొందరగా బరువు తగ్గుతారు. 

బరువు పెరిగినంత ఫాస్ట్ గా తగ్గడమేనేది జరగదు. బరువు తగ్గాలంటే ఎన్నో ప్రయత్నాలు చేయాలి. చేసినా అంత తొందరగా బరువు తగ్గుతారన్న నమ్మకం ఉండదు. కానీ ప్రతిరోజూ ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా బరువు తగ్గుతారు. 
 

బరువు తగ్గాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు వాకింగ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. అలాగే ఫుడ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఫుడ్ వల్లే బరువు పెరుగుతారు. అందుకే బరువును పెంచే ఆహారాలను తినకపోవడమే మంచిది. అయితే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను తిన్నా.. ఫాస్ట్ గా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉదయాన్నే పరిగడుపున తినాలి. అప్పుడే మంచి ఫలితాలను పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం పదండి.

ఖర్జూరం

ఖర్జూరాలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి మీరు బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడతాయి. ఈ ఖర్జూరాల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అంటే వీటిని తింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది.

ఎక్కువ తినాలనే కోరికను చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే దీనిలో నేచురల్ షుగర్స్ పుష్కలంగా ఉంటాయి. అంటే ఇవి ఒక రోజుకు అవసరమైన ఎనర్జీని మీకు అందిస్తాయి. అసలిపోకుండా పనిచేయడానికి సహాయపడతాయి. 
 


Dried Figs

అంజీర పండ్లు

అంజీర పండ్లలో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలుంటాయి. అంజీర పండ్లు కూడా డ్రైగా దొరుకుతాయి. ఈ పండ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.

అలాగే దీనిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది మీరు అతిగా తినకుండా చేసి బరువు తగ్గేలా చేస్తుంది.  బరువు తగ్గడానికి నానబెట్టిన అంజీర పండ్లను తినండి. 

జీడిపప్పు

జీడిపప్పును ప్రతిఒక్కరూ ఇష్టంగా తింటారు. ఈ డ్రై ఫ్రూట్స్ టేస్టీగా ఉండటమే కాదు.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్ మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.

ఇది మీరు బరువు తగ్గడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అయితే జీడిపప్పులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే జీడిపప్పులను ఎక్కువగా తినకండి. మోతాదులో తింటేనే మీరు బరువు తగ్గుతారు. లేదంటే బరువు పెరిగిపోతారు. 
 

పిస్తా

పిస్తాలు చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఇవి మీరు ఫాస్ట్ గా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. పిస్తాలను తింటే మీరు ఇబ్బంది లేకుండా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

పిస్తా పప్పుల్లో ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్ ను తింటే ఆకలి చాలా వరకు తగ్గి మీరు తొందరగా బరువు తగ్గుతారు. 

బాదం పప్పు

బాదం పప్పుల్లో మంచి ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీరు సులువుగా బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి. ఈ డ్రై ఫ్రూట్ లో ఉండే ముఖ్యమైన పోషకాలు మీకు అవసరమైన శక్తిని అందిస్తాయి.

అలాగే మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ డ్రై ఫ్రూట్ లో ఉండే పోషకాలు మిమ్మల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా దూరంగా ఉంచుతాయి.
 

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలు తీయగా, టేస్టీగా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. మీ ఆకలిని తగ్గిస్తుంది. మీరు అతిగా తినడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

ఎండు ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఎన్నో అంటు వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. వీటిని తినడంతో పాటుగా మీరు ప్రతిరోజూ శారీరక శ్రమ చేయాలి. అప్పుడే మీరు కోరుకున్న విధంగా బరువు తగ్గుతారు. 
 

Latest Videos

click me!