గుడ్డు తినే విషయంలో అస్సలు చేయకూడని తప్పుులు ఇవే..!

First Published Oct 14, 2024, 9:56 AM IST

ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ కోడిగుడ్డును తినే విషయంలో చాలా మంది పొరపాట్లు చేస్తున్నారట. ఆ పొరపాట్లు ఏంటో.. గుడ్డు ఎలా తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

eggs

ఆరోగ్యంపై కాస్త అవగాహన ఉన్నవారు ఎవరైనా.. ప్రతిరోజూ ఒక కోడి గుడ్డును తమ డైట్ లో భాగం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే.. ఒక మనిషికి రోజుకి అవసరం అయ్యే ప్రోటీన్, విటమిన్లు ఈ గుడ్డులో మనకు లభిస్తాయి. ఒక్క గుడ్డులో మొత్తం తొమ్మిది అమైనో ఆమ్లాలు ఉంటాయి. అంతేకాదు..  విటమిన్ బి12, విటమిన్ బి2, విటమిన్ డి , విటమిన్ ఏ, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. కోడిగుడ్డు ఆరోగ్యానికి మంచిది అని చెబుతుంటారు.

eggs

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ కూడా కోడిగుడ్డులో పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె, మెదడు ఆరోగ్యానికి మనకు సహాయపడతాయి. గుడ్లలో లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుడ్డులోని  మరో స్పెషాలిటీ ఏంటంటే..  ఇది తినడం వల్ల... మీ మెదడుతో పాటు.. ఎముకలకు కూడా మేలు చేస్తుంది. అందుకే.. దానిని మన ఆరోగ్యం కోసం సరిగా వినియోగించుకోవడం చాలా ముఖ్యం. మరి.. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ కోడిగుడ్డును తినే విషయంలో చాలా మంది పొరపాట్లు చేస్తున్నారట. ఆ పొరపాట్లు ఏంటో.. గుడ్డు ఎలా తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

Latest Videos


ఇలా గుడ్డు తినకూడదు..

గుడ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది, అయినా మీరు పచ్చి గుడ్డు తినకూడదు. అంతేకాదు.. హాఫ్ బాయిల్డ్ కూడా తినకూడదు. పచ్చి లేదా ఉడికించని గుడ్లు తినడం వల్ల సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ మానిఫోల్డ్ రిస్క్ పెరుగుతుంది. దీని వలన మీరు అతిసారం, వాంతులు , జ్వరం లాంటి సమస్యలు రావచ్చు. అందువల్ల, మీరు గుడ్లు తిన్నప్పుడల్లా వాటిని సరిగ్గా ఉడికించాలి. మీరు పచ్చి గుడ్ల నుండి కొన్ని ఆహార పదార్థాలను తయారు చేసి తినొచ్చు. కానీ.. డైరెక్ట్ గా పచ్చిగుడ్డు తినకూడదు.

ఇక.. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే.. గుడ్డులోని తెల్లసొన మాత్రమే ఆరోగ్యానికి మంచిదని.. పచ్చసొన కాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ... గుడ్డు పచ్చసొనలో చాలా పోషకాలు ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో విటమిన్లు A, D, E, K, B12 ఫోలేట్ వంటి ముఖ్యమైన యాంటీ-ఆక్సిడెంట్లు ఉన్నాయి, ఆరోగ్యకరమైన కొవ్వులు, లుటిన్ , కోలిన్, ఇవి మీ ఆరోగ్యంపై, ముఖ్యంగా మెదడుపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. అందుకే.. తెల్లసొన మాత్రమే కాదు.. లోపలి భాగం కూడా కలిపి.. గుడ్డును మొత్తం తినడం అలవాటు చేసుకోవాలి.

eggs

ఈ కాంబినేషన్లు తినకూడదు...
ప్రజలు అనేక ఇతర ఆహారాలతో గుడ్లు తినడానికి ఇష్టపడతారు. కానీ సరికాని ఆహారం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు, మీరు వైట్ బ్రెడ్ వంటి అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన గుడ్లు తింటే.. మీ శరీరంలో షుగర్ లెవల్స్ ని పెంచేస్తుంది.అలాగే గుడ్డులోని పోషకాలు శరీరంలో సరిగా అందవు. అందుకే గుడ్లు తిన్నప్పుడల్లా ఫుడ్ కాంబినేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తృణధాన్యాలు, అవకాడో లేదా కూరగాయలు మొదలైన వాటిని గుడ్లతో తినడానికి ప్రయత్నించండి.

egg

కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనేది నిజమే, అయితే వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీని వల్ల సమతుల ఆహారం సరిగా తీసుకోలేకపోతున్నారు. మీరు ఒకేసారి ఎక్కువ గుడ్లు తిన్నప్పుడు, మీ క్యాలరీల సంఖ్య  పెరిగిపోవడమే కాకుండా, కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచుతుంది. కొంతమంది వ్యక్తులలో, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, మీరు గుడ్లు తీసుకుంటే, ఆరోగ్య నిపుణుల సలహా మేరకు వాటి పరిమాణాన్ని పరిమితం చేయండి.  ఒకటి లేదంటే.. రెండుకు మించి కోడిగుడ్లు తినకూడదు అనే విషయాన్ని తెలుసుకోండి.

click me!