కూరగాయల్లో బంగాళదుంప రారాజు. ఎందుకంటే అన్ని రకాల కూరగాయలను ఆలుగడ్డలో కలిపి వండొచ్చు. అందుకే చాలా మంది బంగాళాదుంపలను ఏదో ఒక విధంగా రోజూ తింటుంటారు. కానీ బంగాళాదుంపలను రోగ్యులర్ గా తినొద్దు. ఎక్కువగా కూడా తినకూడదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
potato 5.j
ఊబకాయం
బంగాళదుంపలను రోజూ తింటే శరీర బరువు పెరుగుతుంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. నిజానికి బంగాళాదుంపలలో కేలరీలు, పిండి పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీరు బరువు పెరగడానికి కారణమవుతాయి.
రక్తపోటు
రక్తపోటు సమస్యలు అస్సలు మంచివి కావు. కానీ రోజూ బంగాళాదుంపలను తింటే రక్తపోటు సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు ఇప్పటికే రక్తపోటు సమస్యలతో బాధపడుతుంటే దానిని తగ్గించండి.
potato
రక్తంలో చక్కెరను
డయాబెటీస్ పేషెంట్లకు బంగాళాదుంపలు మంచివి కావు. వీళ్లు బంగాళాదుంపలను తినకపోవడమే మంచిది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బంగాళాదుంపలను ఎక్కువగా లేదా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర బాగా పెరుగుతుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు బంగాళదుంపలకు దూరంగా ఉండాలి.
potato 1.j
ఎముకల నొప్పి
ఎముకల ఆరోగ్యానికి కూడా బంగాళాదుంపలు మంచివి కావు. రోజూ బంగాళాదుంపలను ఎక్కువగా తినడం వల్ల ఎముకల నొప్పి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీకు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నట్టైతే బంగాళాదుంపలు తినడం మానుకోండి.
potato
కొలెస్ట్రాల్
బంగాళాదుంపలను డీప్ ఫ్రై చేయడం లేదా పుష్కలంగా నూనెలో ఉడికించడం తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఇలా అస్సలు తినకూడదు. ఎందుకంటే ఆలుగడ్డలను ఇలా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెుగుతుంది. ఇది గుండెజబ్బుల బారిన పడేస్తుంది.
potato
చర్మ సమస్యలు
బంగాళాదుంపలు చర్మ సంబంధిత సమస్యలు పెరగడానికి కూడా కారణమవుతుంది. దీనిలోని ఎక్కువ మొత్తంలో కేలరీలు, పిండి పదార్థాల కారణంగా.. దీనిని తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అలాంటి బంగాళాదుంపలు తినకూడదు
నీలం బంగాళాదుంపలు లేదా మొలకెత్తిన బంగాళాదుంపలను అస్సలు తినవద్దు. ఎందుకంటే ఇవి శరీరంలో అలెర్జీ సమస్యలను కలిగిస్తుంది. ఈ బంగాళాదుంపలు చాలా విషపూరితమైనవి. వీటిని తినడం వల్ల మూర్ఛ వస్తుంది.