వంటలు టేస్టీగా అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published | May 31, 2024, 10:01 AM IST

కొన్ని కొన్ని సార్లు ఎంత బాగా చేసినా వంటలు టేస్ట్ గా అస్సలు కావు. కానీ టేస్ట్ బాలేకుంటే ఎవరూ తినరు. అయితే మీరు చేసిన వంటల టేస్ట్ బాలేనప్పుడు కొన్ని చిట్కాలను ఫాలో అవ్వండి. దీనివల్ల మీ వంటల టేస్ట్ అదురుతుంది. 
 

నిజంగా వంట చేయడం అంత సులువైన పనికాదు. వంటలు ప్రతి ఒక్కరూ చేసినా.. కొందరు మాత్రమే టేస్ట్ గా చేస్తారు. అందుకే అంటారు వంట చేయడం ఒక కళ అని. అయితే కొన్ని కొన్ని సార్లు వంటల టేస్ట్ అంతగా బాగుండదు. దీనివల్ల ఇంట్లో ఎవరూ వీటివైపు చూడరు. అంతా వేస్ట్ అవుతుందేనని ఆడవారు తెగ బాధపడిపోతుంటారు. కానీ మీరు చేసిన వంట వేస్ట్ కాకుండా చేసే చిట్కాలు బోలెడు ఉన్నాయి. అవును కొన్ని సింపుల్ టిప్స్ తో మీరు చేసిన కూరలను టేస్టీ టేస్టీగా మార్చొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

సింపుల్ వంట చిట్కాలు

కుక్కర్ లో టమాటా, నిమ్మ, పెరుగు వంటి మిక్స్డ్ రైస్, బిర్యానీ తయారు చేసేటప్పుడు కొద్దిగా మూత తెరిచి అందులో కొద్దిగా నిమ్మరసం వేసి కలపండి. ఇలా చేస్తే రైస్ చక్కగా ఉడుకుతుంది. మెతుకులు ఒకదానికొకటి అంటుకోవు. 


అరటి పువ్వును సపరేట్ గా ఉంచితే నల్లగా మారుతుంది. ఇలా కాకుండా అరటిపువ్వు ఫ్రెష్ గా ఉండాలంటే  అరటి పువ్వును కోసిన వెంటనే ఉప్పు, పసుపు కలిపిన నీటిలో నానబెట్టండి. ఇలా చేస్తే పువ్వు నల్లగా మారదు.

ఎండాకాంలో సెలవుల్లో కనీసం మీ పిల్లలు ఒక్కసారైనా పకోడీలు చేయమని అడిగి ఉంటారు. అయితే ఈ పకోడీలు ఒక్కోసారి క్రిస్పీగా అవుతుంటాయి. అయితే ఇలా కూడదంటే పకోడీలు తయారు చేసేటప్పుడు వేరుశెనగలను పొడి చేసి శనగపిండితో కలపండి. దీనివల్ల పకోడీలు క్రంచీగా అవుతాయి. 
 

యమ్ లను తినడం వల్ల నాలుక దురదగా ఉంటుంది. కానీ వీటిని  ఫ్రై చేసుకుని తినడం ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. వీటిని తిన్నా మీ నాలుక దురద పెట్టకూడదంటే వీటిని ఉడకబెట్టేటప్పుడు చింతపండు నీళ్లలో మరిగించి తినండి. 

cooking

పిల్లలకు మధ్యాహ్న భోజనం కోసం టమాటా రైస్ ను చాలా మంది తయారుచేస్తుంటారు. అయితే ఈ టమాటా రైస్ ఒక్కోసారి మనమే తినలేనంత భయంకరంగా మారుతుంది. ఇలాంటి దాన్ని టేస్టీగా మార్చాలనుకుంటే టమాటా రైస్ తయారు చేసేటప్పుడు కొన్ని అల్లం, పచ్చిమిర్చి, టమాటాలను గ్రైండ్ చేసి దాంట్లో కలపండి. దీనివల్ల టమాటా రైస్ సువాసనగా, టేస్టీగా ఉంటుంది.

క్రంచీ టేస్ట్ కోసం వేయించిన అప్పడను తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ వీటిని నూనెలో వేసి తీస్తారు. కానీ దీనివల్ల అప్పడం ఆయిలీగా మారుతుంది. ఈ రుచి చాలా మందికి నచ్చదు. దీని రుచి మారకుండా, ఆయిలీగా ఉండకూడదంటే అప్పడకు రెండు వైపులా నూనెను తేలికగా అప్లై చేసి మంటల్లో కాల్చండి. 
 

Latest Videos

click me!