rice
బియ్యంలో విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, ఫైబర్, ఇనుము, థియామిన్,రిబోఫ్లేవిన్ తో సహా ఎన్నో పోషకాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ చాలా మంచి బియ్యాన్ని పచ్చిగానే తింటుంటారు. ఇలా తింటే పెళ్లిలో వాన పడుతుందని పెద్దలు అంటుంటారు. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ బియ్యాన్ని తింటే మాత్రం మీరు ఎన్నో వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అసలు బియ్యం తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఫుడ్ పాయిజనింగ్
బియ్యాన్ని ఎప్పుడూ కూడా ఉడికించి అన్నం రూపంలోనే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముడి బియ్యాన్ని తింటే ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పొత్తికడుపు నొప్పి
పచ్చి బియ్యాన్ని తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. నిజానికి ముడి బియ్యం అంత తొందరగా జీర్ణం కావు. ఇది కడుపు నొప్పికి దారితీస్తుంది. అందుకే ముడి బియ్యాన్ని అస్సలు తినకూడదు.
సోమరితనం
ముడి బియ్యాన్ని తినడం వల్ల శారీరక అలసట, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. అలాగే బియ్యాన్ని ఎక్కువగా తింటే సోమరితనం కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియ అవాంతరాలు
ముడి బియ్యంలో లెక్టిన్ అనే మూలకం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. బియ్యాన్ని ఎప్పుడూ కూడా వండుకుని తినడం వల్లే ప్రయోజనకరంగా ఉంటుంది.
కడుపు ఉబ్బరం
ముడి బియ్యాన్ని తినడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం. కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. బియ్యం ప్రేగు కదలికలలో ఇబ్బందిని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అపెండిసైటిస్ కారణాలు
ముడి బియ్యాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల మూత్రపిండాల సమస్యలు వస్తాయి. మీకు ఇప్పటికే మీకు మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉంటే ముడి బియ్యం, వంకాయ, టమాటాలు, శెనగలు, మినప్పప్పు మొదలైన ఆహారాలను తినడం మానుకోవాలి.
వాంతుల సమస్య
ముడి బియ్యంలో లెక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అంత సులువుగా జీర్ణం కాదు. వీటిని తింటే వాంతులు, విరేచనాలు మొదలైనవి వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.