మీరు చదివింది నిజమే. మనం ఉదయం లేవగానే కమ్మగా, వేడి వేడి టీ ని ఆస్వాదిస్తూ ఉంటాం. మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్లేస్ లో ఉన్నా.. సమయంతో పని లేకుండా.. రోజులో ఒక్కసారైనా వేడి వేడి టీ తాగడాన్ని ఇష్టపడతారు. అలాంటి టీనే.. మన నేషనల్ డ్రింక్ గా ప్రకటించారు.
మన దేశంలో ప్రతిరోజూ మిలియన్ల మంది ఈ టీ( చాయ్) ని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. టీ ని కేవలం నార్మల్ ఫ్లేవర్ లా కాకుండా... చాలా రకాల ఫ్లేవర్స్ లో దీనిని ఆస్వాదించవచ్చు. అల్లం టీ, యాలకుల టీ, మసాలా టీ అంటూ... ఒక్కొక్కరు ఒక్కో రకం టీని తాగడానికి ఇష్టపడతారు. కేవలం.. మన దేశంలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా టీని చాలా ఎక్కువ మంది ఇష్టపడి తాగుతూ ఉంటారు.