మంచిది కదా అని లెమన్ వాటర్ ఎక్కువ తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published | Jan 10, 2024, 4:17 PM IST

నిజమే.. నిమ్మకాయ నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే.  ముఖ్యంగా దాని నిర్విషీకరణ లక్షణాలు , జీర్ణ ఆరోగ్యం, జీవక్రియపై సానుకూల ప్రభావాల కోసం ఈ నీటిని తాగొచ్చు. కానీ లెమన్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దుష్పరిణామాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 


మీ హెల్త్ సీక్రెట్ ఏంటి అని సెలబ్రెటీలను ఎవరిని అడిగినా.. వెంటనే ఉదయాన్నే తాము లెమన్ వాటర్ తాగుతాం అని చెబుతూ ఉంటారు. అది నిజమని నమ్మి.. చాలా మంది పాపం.. అదే ఫార్ములా ఫాలో అవుతూ ఉన్నారు. నిజమే.. నిమ్మకాయ నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే.  ముఖ్యంగా దాని నిర్విషీకరణ లక్షణాలు , జీర్ణ ఆరోగ్యం, జీవక్రియపై సానుకూల ప్రభావాల కోసం ఈ నీటిని తాగొచ్చు. కానీ లెమన్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దుష్పరిణామాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల ముఖ్యమైన అవయవాలు , మొత్తం శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాలు పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ సి లెవెల్స్ పెరిగే ప్రభావం ఉంటుంది
 

Latest Videos



శరీరానికి విటమిన్ సి చాలా అవసరం అయినప్పటికీ, చాలా ఎక్కువ తీసుకుంటే రక్తంలో ఐరన్  స్థాయిలను పెంచుతుంది. ముఖ్యమైన అవయవాలను ప్రభావితం చేస్తుంది. శరీరంలో ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడానికి విటమిన్ సి మితంగా తీసుకోవడం మంచిది.
 

లెమన్ వాటర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపునొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. అధిక మోతాదులో విటమిన్ సి కడుపులో అధిక యాసిడ్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది, ఇది ఎసిడిటీని పెంచుతుందని, ఇది అతిసారం, వికారం ,ఇతర అసౌకర్యాల వంటి జీర్ణశయాంతర సమస్యలకు దారితీస్తుంది


నిమ్మరసం ఎక్కువగా తాగేవారికి నోటిపూత వచ్చే ప్రమాదం కూడా ఉందది. నోటి దుర్వాసనతో పోరాడటానికి , దంతాలను శుభ్రపరచడానికి దీనిని ఉపయోగిస్తున్నప్పటికీ, అధిక వినియోగం నోటి మంటకు దారితీస్తుందని, పుండ్లు, పొక్కులు , చికాకు కలిగిస్తుందని  నిపుణులు చెబుతునన్ారు. నిమ్మకాయలు కూడా నోటి ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే గొంతు నొప్పికి దోహదం చేస్తాయి.


మీరు రోజువారీ మందుల వాడేవారైతే, నిమ్మరసం మీ మందులపై   ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది.  వాటిని తక్కువ ప్రభావవంతంగా చేస్తుంది లేదా ఎలర్జీ కూడా రావచ్చు. కాబట్టి.. ఏదైనా మందులు వాడేవారు.. లెమన్ వాటర్ తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి.
 

click me!