భోజనం తర్వాత టీ, కాఫీ తాగుతున్నారా...?

First Published | Feb 18, 2021, 10:36 AM IST

అసలు భోజనం తర్వాత టీ తాగడం వల్ల ఏ  సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం...
 

ఉదయం లేచిన తర్వాత వేడి వేడిగా టీ కానీ, కాఫీ కానీ తాగనిదే చాలా మంది రోజు మొదలవ్వదు. చాలా మంది సమయం సందర్భం లేకుండా టీ తాగుతూ ఉంటారు. లేవగానే ఒకసారి టీ తాగడం.. టిఫిన్ చేశాక టీ తాగడం, మళ్లీ సాయంత్రం, మధ్యాహ్నం భోజనం తర్వాత ఇలా.. ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తుంటారు. అయితే.. భోజనం తర్వాత టీ కానీ కాఫీ గానీ తాగడం వల్ల మనకు తెలీకుండానే సమస్యలు కొని తెచ్చుకున్నవాళ్లం అవుతామట.
undefined
అసలు భోజనం తర్వాత టీ తాగడం వల్ల ఏ సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం...
undefined

Latest Videos


భోజనం తర్వాత టీ, కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత తాగడం వల్ల కాఫీలో ఉండే కెఫైన్ మనం తీసుకున్న ఆహారంలోని న్యూట్రిన్స్ ని అది లాగేసుకుంటుంది. దాని వల్ల మనం తీసుకున్న ఆహారం మనకు శరీరానికి ఏ విధంగానూ ఉపయోగపడదు.
undefined
అంతేకాదు.. టీ ఆకుల్లో యాసిడ్ ప్రాపర్టీస్ ఉంటాయి.. అవి మన శరీంలో ప్రోటీన్ తయారవడానికి సహాయపడతాయి. అయితే.. భోజనం తర్వాత తాగడం వల్ల ప్రోటీన్స్ ఎక్కువయ్యి.. అరుగుదల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
undefined
మనం తీసుకున్న ఆహారంలోని న్యూట్రిషన్స్ ని తగ్గించేస్తాయి.
undefined
కడుపునిండా భోజనం చేసిన తర్వాత టీ, కాఫీ తాగడం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల గుండెనొప్పి వచ్చే ప్రమాదం కూడా ఉంది.
undefined
పాలతో చేసిన టీ, కాఫీ భోజనం తర్వాత తీసుకోవడం ప్రమాదం కానీ.. గ్రీన్ టీ, హెర్బల్ టీ మాత్రం తీసుకోవచ్చు అని నిపునణులు చెబుతున్నారు.
undefined
గ్రీన్ టీ, హెర్బల్ టీలలో యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలను తొందరగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.
undefined
మీకు భోజనం తర్వాత కచ్చితంగా టీ, కాఫీ తాగాల్సిందే అని అంటే.. భోజనం చేసిన గంట తర్వాత తాగడం ఉత్తమం. ఆ గంటలోపు మన శరీరానికి అందాల్సిన ఐరన్, ప్రోటీన్స్ అందుతాయి. కాబట్టి ఆ తర్వాత టీ తాగడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు.
undefined
అలా కాకుండా భోజనం చేసిన వెంటనే టీ, కాఫీ తాగడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఐరన్ అందదు. దీంతో.. ఐరన్ డెఫిషియన్సీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
undefined
click me!