సౌత్ ఇండియాలో అదిరిపోయే బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..!

First Published | Feb 17, 2021, 12:14 PM IST

కేరళ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ విభిన్న రుచులతో రకరకాల బ్రేక్ ఫాస్ట్ లు అందుబాటులో ఉన్నాయి.  

ఉదయాన్న లేవగానే కడుపులో ఎంత కొంత ఆహారం పడనిది ఏ పనీ చేయలేం. ముందు ఏ పని చేయాలన్నా శక్తి కావాలి కదా.. ఆ శక్తి మనకు అల్పాహారం అందిస్తుంది. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో లభించే అన్ని వెరైటీ అల్పాహారాలు మరెక్కడా దొరకవు. నార్త్ ఇండియాలో మహా అయితే.. వడాపావ్, మసాలా పావ్ అంటూ బ్రెడ్ లేదంటే పోహ లాంటివి తింటారు. కానీ... దక్షిణ భారత దేశంలో మాత్రం బ్రేక్ ఫాస్ట్ లిస్ట్ చాలా పెద్దదనే చెప్పాలి.
కేరళ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ విభిన్న రుచులతో రకరకాల బ్రేక్ ఫాస్ట్ లు అందుబాటులో ఉన్నాయి. రుచికి రుచి.. ఘాటుకి ఘాటు ఏదీ తక్కువ కాకుండా అద్భుతంగా ఉంటాయి. దక్షిణ భారత దేశంలో కామన్ గా లభించే.. కొన్ని రకాల బ్రేక్ ఫాస్ట్ లు ఇప్పుడు మనం చూద్దాం..

. ఉప్మా..తేలికగా తీసేస్తాం కానీ.. సరిగ్గా చేయడం వస్తే ఉప్మా కూడా చాలా రుచిగా ఉంటుంది. బొంబాయి రవ్వ, గోధుమ రవ్వలతో దీనిని తయారు చేస్తారు. దీనిలో కూరగాయలు కూడా జత చేసుకోవచ్చు. జీడిపప్పు, కొద్దిగా నెయ్యి జతచేస్తే మరింత రుచిగా ఉంటుంది. తయారు చేయడం చాలా సులువు. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు మాత్రమే ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
2. ఉల్లి రవ్వ దొశ..దోశల్లోనూ మన దగ్గర చాలా రకాలు ఉంటాయి. వాటిలో ఉల్లి రవ్వ దోశ కూడా ఒకటి. బియ్యం పిండి, రవ్వ, కొద్దిగా పెరుగు, మైదా, నీరు కలిసి దోశ బ్యాటర్ తయారు చేసుకుంటారు. సన్నగా తురిమిన ఉల్లి ముక్కలు దోశకు మరింత రుచిని అందిస్తాయి.
3. మసాలా ఇడ్లీ..కామన్ గా మనం ఇడ్లీ తింటూనే ఉంటాయి. అయితే.. మసాలా ఇడ్లీ ఇంకాస్త రుచిగా ఉంటుంది. ఇడ్లీలు నార్మల్ గా వండుకున్న తర్వాత.. స్పెషల్ గా మసాలా తయారు చేసుకుంటారు. ఈ మసాలా ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమాటాలు, కొద్దిగా పావు బాజీ మసాలా తో తయారు చేస్తారు.
4. పుట్టు..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ లో ఈ పుట్టు కూడా ఒకటి. కేరళ ఫేమస్ ఫుడ్ ఇది. బియ్యం పిండితో పొరలుగా చేసి.. దానిలో కొబ్బరి తురుము పెట్టి తయారు చేస్తారు. పప్పు కాంబినేషన్ లేదా ఎదైనా కర్రీతో దీనిని తయారు చేయవచ్చు.
5.పొంగల్..రైస్ తో రెండు రకాల పొంగల్స్ చేయవచ్చు. చెక్కర పొంగలి తియ్యగా ఉంటుంది. వేణ్ పొంగల్ ఘాటుగా ఉంటుంది. దీనిని మనం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటాం.
6.సాంబర్ వడవడ అంటే చాలా మంది ఇష్టం ఉంటుంది. మినపప్పుతో దీనిని తయారు చేస్తారు. వేడి నూనెలో వేగి.. కరకరాలుడతూ ఉండే వడ ని సాంబర్ తో తింటే మరింత రుచిగా ఉంటుంది.
7.పనియారామ్( గుంట పునుగులు)దోశ పిండి లేదా ఇడ్లీ పిండి ఇంట్లో మిగిలిపోయిందనుకోండి.. వాటితో ఈ పనియారమ్ అదే గుంట పునుగులు వేసుకోవచ్చు. తక్కువ నూనెతో వీటిని తయారు చేసుకోవచ్చు. వీటి కోసం ప్రత్యేకంగా ప్యాన్ కూడా అందుబాటులో ఉంటుంది.
8.ఇడియప్పం..కేరళ, తమిళనాడు, శ్రీలంక ట్రెడిషనల్ అల్పాహారం ఈ ఇడియప్పం. బియ్యం పిండితో నూడిల్స్ మాదిరి తయారు చేసుకుంటారు. తర్వాత వీటిని ఇడ్లీ కుక్కర్ లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకుంటారు. ఏదైనా కర్రీ తో వీటిని తినొచ్చు.
9.ఉల్లి ఊతప్పం.సౌత్ ఇండియాలో లభించే పాపులర్ బ్రేక్ ఫాస్ట్ లో ఇది కూడా ఒకటి. దోశ పిండితో కాస్త మందంగా వేస్తారు. దీనిలో ఉల్లి, పచ్చిమిరపకాయ, కొత్తిమీర తురుము ఇలా కలిపి ఊతప్పం వేసుకుంటారు.
10.చెట్టినాడ్ అప్పం..చూడటానికి ప్యాన్ కేక్ లా ఉంటుంది. బియ్యం పిండి, కొబ్బరి పాలతో కలిపి తయారు చేస్తారు. తమిళనాడులో ఇది చాలా ఫేమస్.

Latest Videos

click me!