గరం గరం.. గ్రీన్ మిర్చీ చాయ్... రుచి చూశారా..?

First Published Feb 17, 2021, 11:17 AM IST

మరి ఎప్పుడైనా పచ్చి మిరపకాయలతో తయారు చేసిన టీని రుచి చూశారా..? వినడానికి వింతగా ఉన్నా.. ఈ వింత టీని ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారట. మరి ఈ టీ విశేషాలు మనమూ ఓసారి తెలుసుకుందామా..

టీ అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది ఏంటి..? వేడి వేడిగా ఉంటుంది.. నాలుకకి మాత్రం తియ్యగా తగులుతుంది. ఇది కామన్ గా అందరూ చేసుకునే టీ. ఇప్పుడు ఈ టీలో చాలా రకాలు వచ్చాయి. అల్లం టీ, ఇలాచీ టీ, మసాలా టీ.. ఇలా చాలా రకాలు ఉన్నాయి.. వీటన్నింటిని మీరు కూడా రుచి చూసే ఉంటారు.
undefined
మరి ఎప్పుడైనా పచ్చి మిరపకాయలతో తయారు చేసిన టీని రుచి చూశారా..? వినడానికి వింతగా ఉన్నా.. ఈ వింత టీని ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారట. మరి ఈ టీ విశేషాలు మనమూ ఓసారి తెలుసుకుందామా..
undefined
బెంగళూరులోని ఓ కేఫ్ ఈ రకం చాయ్ ని పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ చాయ్ ... సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తీపికి తీపి.. మిర్చీ ఘాటు.. హాట్ హాట్ గా అందిస్తున్న ఈ ఛాయ్ కి ఇప్పుడు విపరీతంగా ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు..
undefined
తాజా పచ్చి మిరపకాయలు, టీ పొడి, పాలు, పంచదార కాంబినేషన్ లో ఈ తయారు చేస్తున్నారు. ఇంతవరకు ఇలా పచ్చిమిరపకాయలతో ఛాయ్ ఎవరూ తయారు చేయలేదు.
undefined
దీంతో.. దీనిపై అందరి కళ్లు పడుతున్నాయి. జలుబు, గొంతు నొప్పి, దగ్గుతో బాధపడుతున్న వారు ఒక్కసారి ఈ టీ తాగితే.. ఎలా వచ్చాయో కూడా తెలీకుండా తగ్గిపోవడం ఖాయమని ఆ కెఫే నిర్వాహాకులు గర్వంగా చెబుతున్నారు.
undefined
ఈ గ్రీన్ మిర్చీ ఛాయ్ మాత్రమే కాకుండా.. వీళ్లు పలు రకాల టీలను కూడా పరిచయం చేస్తుండటం గమనార్హం. మారకాన్ మింట్, కశ్మరీ కవ్వా, ఓరియంటల్ జింజర్, దేశీ మసాలా ఛాయ్ లాంటి వివిధ రకాల టీలు, అంతేకాకుండా పలు విభిన్నమైన మిల్క్ షేక్ లను కూడా ఆ కేఫ్ లో అందిస్తున్నారు.
undefined
ఇంతకీ ఈ కేఫ్ ఎక్కడ అనే విషయం చెప్పనే లేదు కదా.. బెంగళూరులోని జేపీ నగర్ లో ఉంది. కేఫ్ పేరు చాయఫీ కేఫ్.. అటుగా వెళితే.. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి.
undefined
click me!