నెల రోజులు అన్నం తినకపోతే ఏమౌతుందో తెలుసా?

First Published | Oct 17, 2024, 2:23 PM IST

మనలో చాలా మంది మూడు పూటలా అన్నాన్నే తింటుంటారు. అయితే ఈ అన్నాన్ని మనం ఒక్క నెల పాటు తినకపోతే ఏం జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా?

మన రోజువారి ఆహారంలో వైట్ రైస్ చాలా ముఖ్యమైన భాగం. చాలా మంది అన్నం తినకుండా ఒక్క రోజు కాదు ఒక్క పూట కూడా ఉండలేరు. కానీ వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, దీన్ని తింటే బరువు పెరుగుతామని చాలా మంది అన్నాన్ని తినడం తగ్గించేశారు. అయితే మీరు మీ రోజువారి ఆహారం నుంచి ఒక నెల పాటు అన్నాన్ని తినకుండా ఉంటే మీ శరీరంలో జరిగే మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

వైట్ రైస్ భారతీయ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. చాలా చోట్ల ఇదే ప్రధాన ఆహారం. దీనిని ఉపయోగించి ఎన్నో రకాల వంటకాలను తయారుచేస్తుంటారు.

కానీ ఈ మధ్య కాలంలో వైట్ రైస్ ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి బాగా చర్చ జరుగుతోంది. చాలా మంది తమ ఆరోగ్యానికి మేలు చేయడానికి తెల్ల బియ్యాన్ని వదిలేసి ఇతర ధాన్యాలను తినడాన్ని ఇష్టపడుతున్నారు. 

తెల్ల బియ్యం ఎందుకు ఆరోగ్యకరమైనవి కావు?

బ్రౌన్ రైస్ ను పాలిష్ చేసి వైట్ రైస్ ను తయారుచేస్తారు. ఈ ప్రక్రియలో వరి ధాన్యం బయటి భాగాన్ని మాత్రమే తొలగించడం కాకుండా.. దీనిలో ఉండే ఎన్నో రకాల ముఖ్యమైన పోషకాలు కూడా తొలగిపోతాయి.

బాహ్య  భాగంలో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఇవన్నీ పాలిషింగ్ లో బయటకు పోతాయి. అంటే ఈ వైట్ రైస్ మనకు పెద్దగా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగించదు.
 


white rice


నెల రోజుల పాటు వైట్ రైస్ ను తినకపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:  అవును వైట్ రైస్ ను నెల పాటు తినడం మానేస్తే మీరు చాలా వరకు బరువు తగ్గుతారు. ఎందుకంటే వైట్ రైస్ లో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో వైట్ రైస్ చాలా త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే త్వరత్వరగా ఆకలి అవుతుంది. అలాగే ఇతర ధాన్యాలలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. మీ బరువు పెరగకుండా కాపాడుతాయి. అదే మీరు వైట్ రైస్ ను తింటే త్వరగా బరువు పెరిగిపోతారు. 

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి:  వైట్ రైస్ లో  గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దీన్ని తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఫాస్ట్ గా పెరుగుతాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు దీన్ని తినకూడదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెప్తారు. 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:  వైట్ రైస్ లో ఫైబర్ ఉండదు. కాబట్టి దీన్ని తింటే మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. కానీ ఇతర ధాన్యాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.
 


హార్ట్ హెల్త్:  వైట్ రైస్ లో ఎక్కువ మొత్తంలో స్టార్చ్ ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను బాగా పెంచుతుంది. గుండె జబ్బులు రావడానికి కొలెస్ట్రాల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి నెల రోజుల పాటు మీరు వైట్ రైస్ ను తినడం మానేస్తే మీ హార్ట్ హెల్తీగా ఉంటుంది.

వైట్ రైస్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి.  ఆ తర్వాత అది వేగంగా పడిపోతుంది. దీంతో బద్దకం, అలసట వంటి సమస్యలు వస్తాయి. ఇతర ధాన్యాలలోని కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. అలాగే శరీరంలో శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి.
 

ఏ విషయాలను గుర్తుంచుకోవాలి?

సమతుల్య ఆహారం: అన్నాన్ని పూర్తిగా మానేయడం మంచిది కాదు. కానీ బ్రౌన్ రైస్, బార్లీ, చిరుధాన్యాలు, ఓట్స్ వంటి ఇతర ధాన్యాలతో భర్తీ చేయొచ్చు. ఇవి మిమ్మల్ని హెల్తీగా ఉంచుతాయి.

న్యూట్రీషియన్ సప్లిమెంట్స్:  ఇతర ఆహార పదార్థాలతో పాటుగా వైట్ రైస్ లో ఉండే పోషకాల లోపాలను కూడా పూర్తి చేయాలి.

వ్యక్తిగత అవసరాలు: ప్రతి వ్యక్తి పోషక అవసరాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఏదైనా ప్రారంభించే ముందు డాక్టర్ ను ఖచ్చితంగా సంప్రదించండి. 

Latest Videos

click me!