బ్రేక్ ఫాస్ట్ లో పాలు, ఓట్స్ ను తింటే ఒక్క బరువు తగ్గడమే కాదు.. ఎన్ని లాభాలు ఉన్నాయో

First Published | Oct 17, 2024, 10:01 AM IST

ఈ రోజుల్లో చాలా మంది ఓట్స్ ను రోజువారి ఆహారంలో భాగం చేసుకున్నారు. ముఖ్యంగా ఓట్స్ ను పాలలో మిక్స్ చేసి తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. నిజానికి ఈ కాంబినేషన్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 

ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే రాత్రి చేసిన డిన్నర్ కు, ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు చాలా గ్యాప్ ఉంటుంది. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అలాగే ఒంట్లో శక్తి కూడా తగ్గుతుంది. అందుకే శరీరానికి పోషణనిచ్చే, రోజంతా బలాన్నిచ్చే పోషకాలు పుష్కలంగా ఉండే బ్రేక్ ఫాస్ట్ ను తినాలి. 

అయితే మనలో చాలా మంది సమయం లేక బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం బరువు తగ్గాలని ఉదయం ఏమీ తినరు. కానీ ఇలా ఉదయం ఏమీ తినకుండా ఉంటే మీ  ఆరోగ్యం బాగా పాడవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితిలో బ్రేక్ ఫాస్ట్ ను ఖచ్చితంగా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో పాలు, ఓట్స్ ను తీసుకోవడం చాలా మంచిది. ఇది హెల్తీ కాంబినేషన్. దీన్ని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు జరుగుతుంది. అసలు ఓట్స్, పాలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


oats


బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్, పాల కాంబినేషన్ చాలా హెల్తీ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ దీనిలో చక్కెరను అసలే కలపకూడదు. అయితే డయాబెటీస్ పేషెంట్లు మాత్రం ఓట్స్ ను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. 

అయితే చాలా మంది ఓట్ మీల్ ను తయారు చేయడానికి.. ఓట్స్ ను రాత్రంతా పాలలో నానబెడతారు. ఉదయాన్నే దీంట్లో నట్స్, పండ్లు, కొంచెం తేనెను మిక్స్ చేసి తింటుంటారు. కానీ జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. 

oats and milk

జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను చాలా తక్కువగా తినాలి. ముఖ్యంగా మొదట్లో ఓట్స్ ను చాలా తక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీకు వీటిని తినాలనిపిస్తే తర్వాత ఆ మొత్తాన్ని పెంచుకోవచ్చు. 

ఓట్ మీల్ చాలా ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్.  ఇది మీ శరీరానికి రోజంతా కావాల్సిన బలాన్నంతా ఇస్తుంది. ఓట్ మీల్ లో ప్రోటీన్, ఫైబర్, పిండి పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది సమతుల్య భోజనం. దీన్ని తింటే కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఎక్కువ సేపు ఆకలి కూడా కాదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Latest Videos

click me!