Cinnamon coffee
బరువు తగ్గడానికి మన దగ్గర చాలా ఫార్ములాలు ఉన్నాయి. ఉదయాన్నే డీటాక్స్ డ్రింక్ లు తాగడం వల్ల వేగంగా బరువు తగ్గుతారని చాలా మంది నమ్ముతారు. అయితే.. కాఫీ తాగినా కూడా ఈజీగా బరువు తగ్గుతారని అయితే.. అందులో దాల్చిన చెక్క పొడి వేస్తే చాలు అని కొందరు చెబుతున్నారు. దీనిని ఈ మధ్యకాలంలో చాలా మంది నమ్ముతున్నారు. మరి, దీనిలో నిజం ఎంత..? కాఫీలో దాల్చిన చెక్క పొడి వేసుకొని కలిపి తాగితే.. నిజంగా బరువు తగ్గుతారా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం…
cinnamon tea
మనలో కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే.. రుచికరమైన కాఫీలో దాల్చిన చెక్క పొడి వేయడం వల్ల… అది శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ ని కూడా కరిగించగలదు అని చాలా మంది నమ్ముతున్నారు. దాల్చిన చెక్క పొడి ఫ్యాట్ ని కరిగిస్తుందా? పరిశోధనల ప్రకారం.. మన శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ ని ఈ దాల్చిన చెక్క కరిగిస్తుందా లేదా అనేది.. మన బాడీలో ఉన్న ఫ్యాట్ మీద ఆధారపడి ఉంటుందట.
రోజుకు 1.5 గ్రాముల కంటే తక్కువ దాల్చిన చెక్క మోతాదులను (సుమారు అర టీస్పూన్) తీసుకుంటే నడుము చుట్టుకొలత 1.68సెం.మీ తగ్గిందని ఓ పరిశోధనలో తేలిందట. అలా అని.. రోజుకు 1.5g కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల పెద్దగా ఎఫెక్ట్ చూపించదట.
దాల్చిన చెక్కను సాధారణంగా వంట, ఆహారంలో మసాలాగా ఉపయోగించినప్పుడు సురక్షితమైనదిగా పరిగణిస్తారు. అయితే, అందరికీ దాల్చిన చెక్క ఆరోగ్యానికి సెట్ అవ్వదు.
కొందరు వ్యక్తులు దాల్చినచెక్క నుండి జీర్ణశయాంతర నొప్పి, అలెర్జీ ప్రతిచర్యలతో సహా దుష్ప్రభావాలను కలిగి ఉంటారు. క్రియాశీల పదార్ధాలలో ఒకటైన కౌమరిన్, కొంతమంది కాలేయాలకు విషపూరితం కావచ్చు. అందుకే.. అందరూ బరువు తగ్గడానికి దాల్చిన చెక్కను ఎంచుకోకూడదు.
కాఫీ, కోకో గురించి ఏమిటి?
బరువు తగ్గడానికి కాఫీ కూడా సహాయపడుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే దీనిని సమర్ధించటానికి ఇంకా మంచి ఆధారాలు లేవు. బరువు తగ్గే అవకాశం అయితే ఉంది కానీ… చాలా తక్కువ మాత్రమే తగ్గగలరు. అలాంటి కాఫీలో దాల్చిన చెక్క పొడి కూడా కలపడం వల్ల బరువు తగ్గే అవకాశాలు మరింత తక్కువ అని చెప్పొచ్చు.
కాఫీ నార్మల్ గా తాగినా.. దాల్చిన చెక్క పొడి కలిపి తాగినా కూడా.. ఈజీగా బరువు తగ్గడం సాధ్యం కాదు. ఒకవేళ ఇవి తాగి, బరువు తగ్గాలి అంటే… ముందు లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవాలి. హెల్దీ డైట్ తీసుకుంటూ.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మాత్రమే.. ఈజీగా బరువు తగ్గుతారట.